గ్రూప్ ‘ఎ’రక్తం ఉన్న వారికి కరోనా ప్రమాదం ఎక్కువ

బీజింగ్ : గ్రూప్ ఒ రక్తం ఉన్న వారి కన్నా టైప్ ఎ రక్తం ఎవరికైతే ఉంటుందో వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్‌కు కేంద్రమైన వుహాన్‌లో ఈ అధ్యయనం సాగింది. గ్రూప్ ఎ రక్తం ఉన్న వారు కరోనా వైరస్‌తో చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. గ్రూప్ ఒ రక్తం ఉన్నవారు 25 శాతం వరకే మరణించే ప్రమాదం ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వుహాన్‌లోని […] The post గ్రూప్ ‘ఎ’ రక్తం ఉన్న వారికి కరోనా ప్రమాదం ఎక్కువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బీజింగ్ : గ్రూప్ ఒ రక్తం ఉన్న వారి కన్నా టైప్ ఎ రక్తం ఎవరికైతే ఉంటుందో వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్‌కు కేంద్రమైన వుహాన్‌లో ఈ అధ్యయనం సాగింది. గ్రూప్ ఎ రక్తం ఉన్న వారు కరోనా వైరస్‌తో చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. గ్రూప్ ఒ రక్తం ఉన్నవారు 25 శాతం వరకే మరణించే ప్రమాదం ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వుహాన్‌లోని జనాభాలో 32 శాతం మంది టైప్ ఒ రక్తం ఉన్నవారే. రక్తం టైప్‌ను బట్టి వైరస్ సోకడంలో ఎందుకు తేడా ఉంటుందో పరిశోధకులు చెప్పలేక పోతున్నారు.

చైనాలో కరోనా వైరస్ సోకినట్టు గుర్తించిన 2173 మందిని హుబెయి లోని మూడు ఆస్పత్రుల నుంచి పరిశోధకులు తమ పరిశోధన లోకి తీసుకున్నారు. వీరిలో తరువాత 206 మంది చనిపోయారు. అదే రీజియన్‌లో వైరస్ బారిన పడిన వారిని వైరస్ సోకని 3694 మందితో పోల్చి పరిశోధనలు సాగించారు. చనిపోయిన 206 మంది రోగుల్లో 85 మందికి టైప్ ఎ రక్తం ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇది మొత్తం మరణాల్లో 41 శాతంతో సమానం. 11మిలియన్ జనాభా ఉన్న వుహాన్ నగరంలో ఆరోగ్యవంతుల్లో 34 శాతం మందికి టైప్ ఎ రక్తం ఉంది. మృతుల్లో 52 మందికి టైప్ ఒ రక్తం ఉన్నట్టు తేలింది.

మరణాల్లో వీరి మరణాలు నాలుగో వంతు వస్తాయి. సాధారణ పరిస్థితుల్లో 32 శాతం మందికి టైప్ ఒ రక్తం ఉంది. ఒ గ్రూపు రక్తం ఉన్న వారితో పోల్చిచూస్తే ఒ గ్రూపు రక్తం కాని వారిలో కరోనా మృత్యుగండం చాలా తక్కువని పరిశోధకులు నిర్ధారించారు. అలాగే ఎ గ్రూపు రక్తం కాని వారి కన్నా ఎ గ్రూపు రక్తం ఉన్న వారిలో రిస్కు చాలా ఎక్కువని పేర్కొన్నారు. అయితే టైప్ ఎ రక్తం ఉన్నంత మాత్రాన నూటికి నూరు శాతం వైరస్ సంక్రమిస్తుందని అఆందోళన చెందవలసిన పని లేదని పరిశోధకులు సూచిస్తున్నారు.

Those with Group A blood have higher risk of coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రూప్ ‘ఎ’ రక్తం ఉన్న వారికి కరోనా ప్రమాదం ఎక్కువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: