ఇద్దరికి ఈ ఏడాది బుకర్ ప్రైజ్

Booker Prize

 

లండన్ : ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ ఈ ఏడాది ఇద్దరిని వరించింది. 2019 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ విజేతలను సోమవారం ప్రకటించారు. కెనడియన్ రచయిత్రి మార్గరెట్ ఎట్‌వుడ్(89),ఆంగ్లోనైజీరియన్ రచయిత్రి బెర్నర్‌డైన్ ఎవరిస్టో(60)లను సంయుక్తంగా ఈ ఏడాది బుకర్స్ ప్రైజ్ వరించింది. కాగా ఈ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి మహిళగా బెర్నర్‌డైన్ ఘనత వహించింది. మరో వైపు ఎట్‌వుడ్‌ను బుకర్ ప్రైజ్ వరించడం ఇది రెండోసారి. లండన్‌లోని గిల్డ్‌హాల్ వేదికగా పీటర్ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలోని న్యాయనిర్ణేతల బృందం విజేతల పేర్లను ప్రకటించింది.‘ టెస్టమెంట్’ పుస్తకానికిగాను మార్గరెట్ ఎట్‌వుడ్‌కు,‘ గర్ల్, ఉమన్, అదర్’కుగాను ఎవరిస్టోకు ఈ అవార్డు లభించింది.

ఈ అవార్డుకింద ఇచ్చే 50 వేల పౌండ్ల నగదును ఇద్దరూ సమానంగా పంచుకోనున్నారు. లండన్ వేదికగా 1969నుంచి ఈ అవార్డును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. బుకర్‌ప్రైజ్ నిబంధనలకు విరుద్ధంగా న్యాయనిర్ణేతలు మరోసారి ఇద్దరికి సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. ఇద్దరు వ్యక్తులకు కలిపి ఈ అవార్డును ఇవ్వకూడదని 1992లో నిర్ణయించారు. అయితే దాదాపు అయిదు గంటలపాటు చర్చించిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరికీ అవార్డు ఇవ్వాలని అయిదుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం నిర్ణయించినట్లు పీటర్ ఫ్లోరెన్స్ చెప్పారు.

This year’s Booker Prize for both

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇద్దరికి ఈ ఏడాది బుకర్ ప్రైజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.