డెరివేటివ్స్, ఫలితాలపైనే దృష్టి

BSE

 

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకులు

ముంబై: ఈ వారం కూడా స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొనవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. సంపన్నులపై విధించిన సర్‌చార్జీ కారణంగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగే అవకాశాలు ఉందని, ట్రెండ్‌ను ప్రధానంగా డెరివేటివ్స్, కార్పొరేట్ ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని అంటున్నారు. జులై ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు గురువారం(25న) ముగియనుంది. దీంతో ఇకపై ఆగస్ట్ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోవైపు పలు కంపెనీలు క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం(19న) మార్కెట్లు ముగిశాక రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాలను వెల్లడించగా, వీటి ప్రభావం సోమవారం మార్కెట్లో కనిపించనుంది.

సోమవారం మారెట్లు, ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదించబడిన తరువాత మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. బడ్జెట్‌పై పెట్టుబడిదారుల ఆశలు నిరాశలవ్వగా, బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు వారంలో 5.50 శాతానికి పైగా పడిపోయాయి. క్యూ 1 ఫలితాలు, వినియోగం, బ్యాంకింగ్, ఆర్థిక ఫలితాలు మార్కెట్లో పాల్గొనేవారి కోసం వాచ్‌లిస్ట్‌లో ఉంటాయి. మందగమనం, లిక్విడిటీ రెండు ప్రధాన అంశాలు చూస్తే వీటిలో ఏదైనా సానుకూలంగా ఉంటే ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టవుతుంది. రుతుపవనాల విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదిలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అమెరికా- చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు వంటి పలు అంశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

క్యూ1 ఫలితాలు
ఈ వారం పలు కంపెనీలు క్యూ1 ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా ప్రైవేటురంగ సంస్థ కొటక్ Mahindra Bank 22న ఫలితాలను వెల్లడించనుండగా, ఈనెల 23న ఎఫ్‌ఎంసిజి దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టి, 24న బ్లూచిప్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ ఫలితాలు ప్రకటిస్తాయి. అలాగే 25వ తేదీనాడు ఎన్‌బిఎఫ్‌సి దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, 26న ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి.

22- జూలై -2019 : కోటక్, యునైటెడ్ స్పిరిట్స్, మాస్టెక్, కోరమాండల్ ఇంటెల్
23- జూలై -2019 : ఎన్‌ఐఐటి టెక్, హెచ్‌యుఎల్, కజారియా, ఎల్ అండ్ టి, ఎస్‌బిఐ లైఫ్, జీ, ఎం అండ్ ఎం ఫిన్, కంట్రోల్ ప్రింట్, బేయర్ క్రాప్
24- జూలై -2019 : భారతి ఇన్‌ఫ్రాటెల్, సాగర్ సిమెంట్, పిఐ ఇండస్ట్రీస్
25- జూలై -2019 : పెర్సిస్టెంట్, బయోకాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రిండ్‌వెల్, అంబుజా, తాజ్ జివికె, టామో
26- జూలై -2019 : బజాజ్ ఆటో, మారుతి, అతుల్, మహీంద్రా లైఫ్‌స్పేస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, విఎస్‌టి ఇండస్ట్రీస్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్.

This week several companies release Q1 results

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డెరివేటివ్స్, ఫలితాలపైనే దృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.