వైద్యంతో పాటు సమాజ సేవలో సైతం భాగస్వామ్యం: సతీష్

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి:  సిద్దిపేట పట్టణంలో గత 32 సంవత్సరాల నుండి డాక్టర్ కస్తూరి సతీష్ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) వైద్య సేవలను లక్షాలాది మందికి అందిస్తూ వస్తున్నారు. 1976లో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇఎన్టీలో వైద్య సేవలు అందించారు. కాగా 1986 లో పల్లె ప్రజలకు సేవలందించాలనే దృక్పథం కలగడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇఎన్టీకి రాజీనామా చేసి […] The post వైద్యంతో పాటు సమాజ సేవలో సైతం భాగస్వామ్యం: సతీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి:  సిద్దిపేట పట్టణంలో గత 32 సంవత్సరాల నుండి డాక్టర్ కస్తూరి సతీష్ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) వైద్య సేవలను లక్షాలాది మందికి అందిస్తూ వస్తున్నారు. 1976లో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇఎన్టీలో వైద్య సేవలు అందించారు. కాగా 1986 లో పల్లె ప్రజలకు సేవలందించాలనే దృక్పథం కలగడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇఎన్టీకి రాజీనామా చేసి 1987 లో సిద్దిపేట పట్టణంలో రోహిణి మెటర్నిటి అండ్ నర్సింగ్ హోమ్ పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటి ఇఎన్టీ సర్జన్‌గా పేరు గడించారు. నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులకు తనదైన శైలిలో వైద్యపరంగా సలహాలు, సూచనలు అందించడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. దీంతో సిద్దిపేట పట్టణంతో పాటు చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలకు సైతం డాక్టర్ సతీష్‌పై ఎంతో నమ్మకం ఏర్పడింది. నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు ఆయన పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలను అందిస్తూ వస్తున్నారు.

మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం: డాక్టర్ కస్తూరి సతీష్

చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా సిద్దిపేటలో 1987లో ఆస్పత్రిని ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు లక్షాలాది మందికి వైద్య సేవలు అందించాను. గ్రామీణ ప్రాంత ప్రజలకు నా వంతుగా సేవలందించడానికే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇఎన్టీ సర్జన్‌గా సేవలందించి ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది.

ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు చర్యగా వైద్యులు అందించే సలహాలు, సూచనలు పాటించాలి. ప్రతిరోజు దినచర్యలో భాగంగా స్విమ్మింగ్ చేయడం అలవరుచుకోవాలి. స్విమ్మింగ్ చేయడంతో శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా జరిగి ఆరోగ్యవంతంగా ఉంటారు. నిత్యం ఆస్పత్రిలో నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నాను. జీవితంలో ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండిపోతాయి. వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలు చేయడం నాకెంతో ఇష్టం. ఆస్పత్రిని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు అనేక సందర్భాల్లో ఉచితంగా వైద్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. ప్రజల దీవెనలతోనే నాకు సమాజంలో మంచి గుర్తింపు లభించింది.

డాక్టర్ కస్తూరి సతీష్ అందించే సలహాలు సూచనలు …

* ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలి.
* ఏ చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తిన వైద్యులను సంప్రదించాలి.
* వైద్యులు సూచించిన ప్రకారమే మందులను వాడాలి.
* ఇష్టానుసారంగా మందులను వాడితే అనారోగ్యానికి గురికాక తప్పదు.
* గ్రామీణ ప్రాంతాల్లో సైతం శుద్ది నీరు సరఫరా చేయడంతో గొంతు సమస్యలు తగ్గుముఖం పట్టాయి
* వేసవి, వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.
* చలికాలంతో గొంతు సమస్యలు వస్తుంటాయి.
* వాహనాల ద్వారా వెలువడే పొగతోనే శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తాయి.
* థైరాయిడ్ సమస్య ఉంటే భయపడాల్సిన అవసరం లేదు.
* నిత్యం మందులు వాడితో థైరాయిడ్ అదుపులో ఉంటుంది.
* థైరాయిడ్‌ను కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో నయం చేయవచ్చు .
* ట్రాన్సిస్ సమస్యతో బాధపడేవారు చల్లటి ఆహార పానీయాలకు దూరంగా ఉండాలి.

 

This Doctor is Public Servant in Medak

 

The post వైద్యంతో పాటు సమాజ సేవలో సైతం భాగస్వామ్యం: సతీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: