లంక కెప్టెన్‌గా తిరిమానె

కొలంబో: పాకిస్థాన్‌లో పర్యటించే శ్రీలంక జట్టును ఎంపిక చేశారు. పాక్‌లో పర్యటించేందుకు కొంత మంది క్రికెటర్లు వెనక్కి తగ్గడంతో సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే లహిరు తిరిమానెతో సహా చాలా మంది ఆటగాళ్లు పాక్‌లో ఆడేందుకు ముందుకు వచ్చారు. దీంతో లంక క్రికెట్ బోర్డు జట్టును పాకిస్థాన్‌కు పంపించేందుకు అంగీకరించింది. కాగా, పాకిస్థాన్ పర్యటనలో శ్రీలంక మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలు కరాచీలో జరుగనుండగా, టి20 మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలువనుంది. […] The post లంక కెప్టెన్‌గా తిరిమానె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొలంబో: పాకిస్థాన్‌లో పర్యటించే శ్రీలంక జట్టును ఎంపిక చేశారు. పాక్‌లో పర్యటించేందుకు కొంత మంది క్రికెటర్లు వెనక్కి తగ్గడంతో సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే లహిరు తిరిమానెతో సహా చాలా మంది ఆటగాళ్లు పాక్‌లో ఆడేందుకు ముందుకు వచ్చారు. దీంతో లంక క్రికెట్ బోర్డు జట్టును పాకిస్థాన్‌కు పంపించేందుకు అంగీకరించింది. కాగా, పాకిస్థాన్ పర్యటనలో శ్రీలంక మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలు కరాచీలో జరుగనుండగా, టి20 మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలువనుంది.

మరోవైపు వన్డే జట్టుకు తిరిమానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు టి20 జట్టుకు దాసున్ శనక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు తప్పుకోవడంతో యువ జట్టును పాక్ పర్యటనకు ఎంపిక చేశారు. వన్డే జట్టులో తిరిమానెతో పాటు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలక, ఎంజెలో పెరీరా, వనిండు హరసంగా, నువాన్ ప్రతీప్, కసున్ రజితా, లహిరు కుమార, సదీరా సమర విక్రమ, దాసున్ శన, లక్షన్ సండకాన్ తదితరులు చోటు సంపాదించారు. మరోవైపు టి20 సిరీస్‌కు తిరిమానె అందుబాటులో ఉండడం లేదు. దీంతో దాసున్ శనకకు కెప్టెన్సీ అప్పగించారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9 వరకు శ్రీలంక జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది.

Thirimanne to lead Sri Lanka on Pakistan tour

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంక కెప్టెన్‌గా తిరిమానె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: