ఒక్క నిమిషం ఆలోచించండి…

   తరిగొప్పుల : ఓటమి గెలుపునకు నాంది.. ఓడిపోయామని నిరుత్సాహానికి గురికాకుండా మరింత ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని తదుపరి విజయం కోసం శ్రమించాలి. విజయం సాధించి చూపాలన్న కసిని పెంచుకోవాలి. ఓటమితో కుంగిపోతే చంద్ర మండలాని కి వెళ్ళగలిగేవాళ్ళమా.. ? ప్రస్తుతం మనం అనుభవిస్తు న్న ఆధునిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చేవా ? ఎన్నో ఓటముల తర్వాత కానీ ఆయా రంగాల్లోని శాస్త్రవేత్తలు విజయం సాధించారన్నది అంతా గుర్తించాలి. అలాగే పరీక్ష త ప్పినంత మా త్రా […] The post ఒక్క నిమిషం ఆలోచించండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 తరిగొప్పుల : ఓటమి గెలుపునకు నాంది.. ఓడిపోయామని నిరుత్సాహానికి గురికాకుండా మరింత ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని తదుపరి విజయం కోసం శ్రమించాలి. విజయం సాధించి చూపాలన్న కసిని పెంచుకోవాలి. ఓటమితో కుంగిపోతే చంద్ర మండలాని కి వెళ్ళగలిగేవాళ్ళమా.. ? ప్రస్తుతం మనం అనుభవిస్తు న్న ఆధునిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చేవా ? ఎన్నో ఓటముల తర్వాత కానీ ఆయా రంగాల్లోని శాస్త్రవేత్తలు విజయం సాధించారన్నది అంతా గుర్తించాలి. అలాగే పరీక్ష త ప్పినంత మా త్రా న కోల్పోయేది ఏ మీ లే దు. మనం అనేవా ళ్ళం ఉంటే ఉజ్వలమైన భవిష్యత్ మనముంగిటే చేరుతుం ది. విజయాలు కూ డా మనసొంతమే అవుతాయి. ఆలోచించండి. ఏప్రిల్, మే నెలలు పరీక్ష ఫలితాలు విడుదలయ్యే సమయం టెన్త్, డిగ్రీ, పీజీ పలు ఉన్నత కోర్సుల ఫలితాలు వెలువడుతుంటాయి. గ్రేడింగ్ విధానంలో వెలువడనున్న ఫలితాల్లో విద్యార్ధులు అద్భుత ఫలితాలను సాధించి, రాష్ట్ర స్థాయిలో రికార్డులు సృష్టించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మరికొంత మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు ఆవేదనను గురి చేసే అవకాశం కూడా ఉంది. పరీ క్ష తప్పామన్న ఆవేదనతో తమ స్నేహితులు, బంధువులు వద్ద తలెత్తుకోలేమోనని క్షణికావేశానికి లోనయ్యే సందర్భాలున్నాయి. గతంలో పరీక్ష ఫలితాల ప్రభావంతో ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. మరికొందరు సమాచారం బయటకు తెలియనీయడం లేదు. ఇటు వంటి ఘటనలు తల్లిదండ్రుల ను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రశాంతంగా ఆలోచించాలి…
ఫలితాలు ఎలా ఉన్నా కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటేచాలని అనవసరంగా ఆందోళనకు ఒత్తిడికి గురై తప్పుడుదారులు వెతకరాదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టు వంటిదని అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది వీరి సూచన. ఎందుకు ఓడిపోయాం కారణమేమై ఉంటుంది. మరోసారి అలాంటి తప్పులు చే యను. అనే విధంగా దానిని సరిదిద్దుకునేందుకు మళ్ళీ ప్రయత్నిస్తే
విజయం తప్పక వర్తిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన చిత్తశుద్దిలో లోపం లేకుంటే ఫలితం ఎలా ఉన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదని విద్యావేత్తల అభిప్రాయం.

Think for a minute …

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒక్క నిమిషం ఆలోచించండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.