దొంగల హల్‌చల్

Robbery

మనతెలంగాణ/ఇందూరు : నిజామాబాద్ జిల్లా ఇందూరు 4వ టౌన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో సాయితేజ జువెల్లరీ, వినయ్‌నగర్ ప్రాంతం శ్రీనగర్ కాలనీలో శ్రీసాయి మహలక్ష్మి జువెల్లరీ, శ్రీచరణ్‌తేజ జువెల్లరీ మూడు బంగారు దుకాణాల్లో ఆదివారం అర్థరాత్రి చోరీకి గురయ్యాయి. ఈ ఘటనలో సుమారు 30లక్షల సొత్తు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి నిజామాబద్ ఎసిపి, సిఐ, ఎస్సైలు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటగా హౌసింగ్ బోర్డులోని సాయితేజ జ్యువెలరీ షెటర్ ధ్వంసం చేసి దొంగలించిన దొంగలు, అలాగే శ్రీనగర్ కాలనీలోని శ్రీసాయి మహాలక్ష్మి జ్యువెలరీ షాపులోకి చొరబడి గ్లాసు అద్దాలు, నగదుకౌంటర్, షోకెస్ బాక్సులు పగులగొట్టి సుమారు 12తులాల బంగారం వస్తువులు, లక్ష20 వేల నగదు, 5లక్షల విలువైన రోల్డ్‌గోల్డ్‌ను సైతం దొంగలించారు. దొంగతనం చేసే ప్రయత్నంలో పగిలిన గ్లాసులు దొంగని గాయపర్చగా రక్తపు మరకలు నేలపై పడ్డాయి. అనంతరం శ్రీచరణ్‌తేజ షాపును షెటర్‌ను ద్వంసం చేసి దొంగలు లోనికి ప్రవేశించి సుమారు 12తులాల బంగారం, వెండిని అ ప హరించారు.

ఈ దొంగలు మహారాష్ట్ర ప్రాంతం నుండి జల్నా పాసింగ్ నంబర్ M.H21c 3047తో ఉన్న సుమోను దొంగలించి నగరానికి వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలినట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగతనానికి పాల్పడిన దొంగలు సుమో వాహనంతో వెళ్తూ నవీపేట ప్రాంతశివారులో సుమోను వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి రెండు ద్విచక్ర వాహనాలను దొంగలించి ఆ ప్రాంతంలో దొంగలించిన సొత్తుకు సంబంధించిన ట్రే, టిఫిన్‌బాక్స్‌ను వదలివెళ్లినట్లు తెలిసింది. బాధితులు మహేంధర్ లక్ష్మినారాయణ, గుండురోజు రామక్రిష్ణ కేసు నమోదు చే యాలని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రా థ మిక విచారణ చేపట్టగా ఎస్‌బి ఇంటాలిజెన్స్ టీంలను రంగంలోకి దించి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో నగ ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Thieves Robbery In three Jewelry Shops In Indore

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దొంగల హల్‌చల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.