కోఠి ఈఎన్‌టి ఆసుపత్రిలో దొంగల బెడద…

  గోషామహల్: కోఠిలోని ఈఎన్‌టి ఆసుపత్రిలో దొంగల బెడద అధికం కావడంతో రోగులు, వారి సహాయకులతో పాటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. గొంతు, ముక్కు, చెవి సంబంధిత శస్త్రచికిత్సలకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఖ్యాతిగాంచిన ఈఎన్‌టి ఆసుపత్రిలో చోరీలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతిరోజూ ఇక్కడికి నగరంతో పాటు వివిధ జిల్లాల నుండి 1000 నుండి 1200 మంది వరకు ఔట్ పేషంట్గు, 5 నుండి 15 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్సలు […] The post కోఠి ఈఎన్‌టి ఆసుపత్రిలో దొంగల బెడద… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోషామహల్: కోఠిలోని ఈఎన్‌టి ఆసుపత్రిలో దొంగల బెడద అధికం కావడంతో రోగులు, వారి సహాయకులతో పాటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. గొంతు, ముక్కు, చెవి సంబంధిత శస్త్రచికిత్సలకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఖ్యాతిగాంచిన ఈఎన్‌టి ఆసుపత్రిలో చోరీలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతిరోజూ ఇక్కడికి నగరంతో పాటు వివిధ జిల్లాల నుండి 1000 నుండి 1200 మంది వరకు ఔట్ పేషంట్గు, 5 నుండి 15 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్సలు పొందుతుంటారు. సోమ, మంగళ వారాల్లో రోగుల రద్దీ మరింత పెరుగుతుంది. ఇదే అదనుగా తరచిన దొంగలు ఆసుపత్రిలోనే తిష్టవేసి, రోగుల్లా నటిస్తూ క్యూ లైన్‌లో నిల్చున్న రోగుల సెల్‌ఫోన్‌లు, ప ర్సులు, బ్యాగులతో పాటు వస్తువులను తస్కరించి పరారవుతున్నారు.

వైద్యులకూ తప్పని బెడద….
ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపైనా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఔట్ షేషంట్లుగా వచ్చిన రోగులను పరీక్షించే వైద్యులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వారి జేబుల్లోని పర్సులను కొల్లగొట్టేస్తున్నారు. వైద్యుల సెల్‌ఫోన్‌లు, మహిళా వైద్యుల హ్యాండ్ బ్యాగులతో పాటు ఇతరత్రా వస్తు సామగ్రిని సైతం క్షణాల్లో మాయం చేసేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చే వైద్యులతో పాటు రోగులకు పరామర్శించేందుకు వచ్చే బంధువులు హెల్మెట్లను సైతం తస్కరిస్తుండటంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో పాటు రోగుల బంధువులు బేజా రెత్తిపోతున్నారు. ఆసుపత్రి పాలకవర్గం సెక్యూరిటీని పెంచి, చోరీలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణా లోపం…
ఆసుపత్రిలో వైద్యాధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా సెక్యూరిటీ సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి 11 గంటలకు వరకు ఓపీ విభాగంలో రద్దీగా ఉంటుంది. అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది తోపులాటలు జరుగకుండా నిలేవరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు రోగుల్లా నటిస్తూ క్యూ లైన్‌లో నిల్చుని అదను కోసం నిరీక్షిస్తున్నారు. ఏమాత్రం అశ్రద్ద వహించిన క్షణాల వ్యవధిలో రోగుల వస్తువుల ను తస్కరించి పరారవుతున్నారు. తరచుగా దొంగతనాలు చోటు చేసుకుంటుండటంతో పర్సులు, సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా వస్తుసామగ్రిని పోగొట్టుకున్న బాధిత రోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో సహచర రోగులు, వారి సహాయకుల వద్ద ఇంటికి వెళ్లేందుకు ఛార్జీలను అడిగి తీసుకుని, భారంగా ఇంటి ముఖం పడుతున్నారు.

చోరీల నియంత్రణకు చర్యలు: ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి శంకర్
ఆసుపత్రిలో దొంగతనాలను నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశామని ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి శంకర్ పేర్కొన్నారు. ఓపీ క్యూలైన్‌ల వద్ద రోగులు, వారి సహాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఆసుప్రతి పరిసరాల్లో తచ్చాడేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో చోరీల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Thieves in the ENT hospital

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోఠి ఈఎన్‌టి ఆసుపత్రిలో దొంగల బెడద… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: