వార్డుబోర్డులో ఇవి తప్పనిసరి…

  ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా కాలేజీ అమ్మాయిల, ఉద్యోగినులు తమ వార్డ్‌బోర్డ్‌ను సరిచేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఉండే దుస్తులను ఎప్పటికప్పుడు ట్రెండ్ ను బట్టి మారుస్తూండాలి. వాటితోపాటు కొన్ని యాక్సెసరీలను కూడా చేర్చుకుంటే బాగుంటుంది. కుర్తీలు: చాలామంది వీటిని ఎక్కువగా ధరిస్తారు. పండగలు, పార్టీలకే కాకుండా క్యాజువల్ వేర్‌గానూ బాగుంటాయి. అయితే సందర్భాన్ని బట్టి వేరు చేసుకుని పెట్టుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాగే చీరలు కూడా ఒకటి రెండు సిద్ధంగా పెట్టుకుంటే […] The post వార్డుబోర్డులో ఇవి తప్పనిసరి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా కాలేజీ అమ్మాయిల, ఉద్యోగినులు తమ వార్డ్‌బోర్డ్‌ను సరిచేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఉండే దుస్తులను ఎప్పటికప్పుడు ట్రెండ్ ను బట్టి మారుస్తూండాలి. వాటితోపాటు కొన్ని యాక్సెసరీలను కూడా చేర్చుకుంటే బాగుంటుంది.
కుర్తీలు: చాలామంది వీటిని ఎక్కువగా ధరిస్తారు. పండగలు, పార్టీలకే కాకుండా క్యాజువల్ వేర్‌గానూ బాగుంటాయి. అయితే సందర్భాన్ని బట్టి వేరు చేసుకుని పెట్టుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాగే చీరలు కూడా ఒకటి రెండు సిద్ధంగా పెట్టుకుంటే ఎప్పడయినా కట్టుకోవచ్చు.
లిటిల్ బ్లాక్ డ్రెస్: నైట్ పార్టీలు, డిన్నర్లు, స్నేహితులతో చేసుకునే చిన్న చిన్న వేడుకలు… ఇలాంటప్పుడు నలుపు రంగు డ్రెస్ ఉంటే ఆ ప్రత్యేకతే వేరు. చుడీదార్, లాంగ్‌గౌను ఏదయినా సరే… దానికి జతగా హై హీల్స్, స్లింగ్ బ్యాగును ఎంచుకుంటే సరిపోతుంది.
క్రాప్‌టాప్: ఇప్పుడు ఇదే ట్రెండ్. పండుగలు, పార్టీలు, మెహెందీ, సంగీత్ లాంటి పార్టీలకు ఎక్కువ పనితనంతో చేసిన లాంగ్ స్కర్టులు, లెహెంగాలపైకి వీటిని ఎంచుకుంటే ఆ అందమే వేరు. పాశ్చాత్య దుస్తులకు తగినట్లుగా కూడా వీటిని వేసుకోవచ్చు.
స్కార్ఫ్: మీ క్యాజువల్ లుక్‌కు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఏ కాలంలోనైనా దీన్ని ధరించొచ్చు.
చెప్పులు: బూట్లు, సాండిల్స్, ఫ్లాట్స్… ఇలా నాలుగైదు జతలు ఉండేలా చూసుకోండి. పార్టీలు, ఆఫీసులకు, కాలేజీలకు.. ప్రత్యేకంగా, రోజూ వేసుకోవడానికి అనువుగా ఉంటాయి.
తెల్లచొక్కా: మీ దుస్తుల్లో తప్పకుండా ఉండాల్సిన వాటిలో ఇదొకటి. ట్రౌజర్‌తోపాటు ఫార్మల్‌గా, జీన్స్‌కు జతగా వేసుకుంటే ఆ అందమే వేరు.
బ్లూ డెనిమ్ జీన్స్: మీ వార్డ్‌రోబ్‌లో కనీసం రెండు జతలు పెట్టుకుంటే… షర్ట్స్, టీషర్ట్స్‌కు, కుర్తాలకు జతగా వేసుకోవచ్చు. కాలేజీకే కాదు, ఉద్యోగానికీ వేసుకెళ్లొచ్చు.
ఇయర్ రింగ్స్: జుంకాలు, చాంద్‌బాలీలు… ఉంటే చాలు మీరు సంప్రదాయంగా కనిపించొచ్చు. వీటిని చీరలకు జతగా ఎంచుకోవచ్చు. చాంద్ బాలీలు సల్వార్ కమీజ్, కుర్తాలకు నప్పుతాయి.
రెడ్ లిప్‌స్టిక్: చెదిరిపోని ఫ్యాషన్ ఇది. ఎవరి చర్మతత్వానికైనా చక్కగా నప్పుతుంది.
స్లింగ్ బ్యాగ్: చీర, చుడిదార్, జీన్స్ వేసుకున్నా ప్రతి డ్రెస్‌కు ఈ బ్యాగు బాగుంటుంది. సంప్రదాయంగా, పాశ్చాత్య వస్త్ర శ్రేణికి కూడా ఇది నప్పుతుంది. ఇవన్నీ కనీస సౌకర్యాలుగా అమ్మాయిలు భావిస్తున్నారు.

 

These are mandatory in the warboard

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వార్డుబోర్డులో ఇవి తప్పనిసరి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.