జిల్లాలో యూరియాకు కొరత లేదు

  రైతులు ఆందోళన చెందవద్దు జిల్లా వ్యవసాయాధికారిణి ప్రయదర్శిని కరీంనగర్ : జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసా యాధికారి ప్రియదర్శిని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 28 నుండి ఇంత వరకు 6,070 మెట్రిక్ టన్నుల యూరి యా జిల్లాకు వచ్చిందని తెలిపారు. ఆ యూరియాను మార్క్‌ఫెడ్ […] The post జిల్లాలో యూరియాకు కొరత లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రైతులు ఆందోళన చెందవద్దు
జిల్లా వ్యవసాయాధికారిణి ప్రయదర్శిని

కరీంనగర్ : జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసా యాధికారి ప్రియదర్శిని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 28 నుండి ఇంత వరకు 6,070 మెట్రిక్ టన్నుల యూరి యా జిల్లాకు వచ్చిందని తెలిపారు. ఆ యూరియాను మార్క్‌ఫెడ్ ద్వారా 3,800 మెట్రిక్ టన్నులు, మిగిలిన యూరియాను హోల్‌సేల్ ఎరువుల డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేస్తు న్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలకు నేరుగా రైల్వే వ్యాగన్ల ద్వారా జిల్లాలకు పంపుతున్నారని, జిల్లాకు వచ్చిన యూరియాను వెంట వెంటనే సొసైటీల ద్వారా, డీలర్ల ద్వారా రైతులకు అందు బాటులో ఉంచు తున్నామని తెలిపారు.

జిల్లాలో జూన్, జూలై మాసాలలో వర్షాలు పడలేదని, ఆగస్టు మాసంలో కురిసిన వర్షాల వల్ల జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరిగిందని వివరించారు. అలాగే ఆలస్యంగా వర్షాలు కురిసినందున వరికి, మొక్కజొన్నకు, పత్తికి ఒకేసారి యూరియా వేయడం వల్ల రైతులకు యూరియా అందించడంలో ఒకటి, రెండు రోజులు ఆలస్యమవుతుందని తెలిపారు. జిల్లాలో ఆలస్యంగా వర్షాలు కురిసినందున ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు 1,10,835 హెక్టార్లు కాగా 1,24,833 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగుచేసారని, ఇది సాధారణ సాగు విస్తీర్ణం కన్నా 112 శాతం ఎక్కువని ఆమె తెలిపారు. జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 41,100 హెక్టార్లు కాగా, ఆలస్యంగా వర్షాలు కురిసినందున 66,422 హెక్టార్లలో వరిసాగు చేసినట్లు ఆమె తెలిపారు.

మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13,084 హెక్టార్లు కాగా, 12,007 హెక్టార్లు సాగు చేసారని, పత్తి 50,968 హెక్టార్లు కాగా, 42,987 హెక్టార్లలో సాగు చేసారని, అపరాలు 854 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా, 15,045 హెక్టార్లలో రైతులు సాగు చేసినట్లు ఆమె తెలిపారు. ఆగస్టు వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 654 మిల్లీ మీ. కాగా 602 మి.మి. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 52,190 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉండగా, ఇతర రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాల వల్ల యూరియా సరఫరాలో అంతరాయం కలిగి ఇంతవరకు 24,370 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చినట్లు తెలపిఆరు.

యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని యూరియాను నేరుగా రాష్ట్రస్థాయి నుండి జిల్లాలకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అందువల్ల జిల్లాలో యూరియా కొరత ఉండబోదని, ప్రతిరోజు రైల్వే రేకుల ద్వారా యూరియాను సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో యూరియా వ్యాగన్లు చేరుకున్నాయని, వాటిని గ్రామాలకు వెంటవెంటనే పంపిస్తున్నామని తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో మార్క్‌ఫెడ్ ఎండి శ్యాం, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అంజలి తదితరులు పాల్గొన్నారు.

There is no shortage of urea

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిల్లాలో యూరియాకు కొరత లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: