రామ్ లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లేడు…

  రామ్, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు గుంటూరు వివిఐటి కాలేజ్‌లో విద్యార్థులతో కలిసి సందడి చేసింది చిత్ర బృందం. ఇక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రం ప్రీ […] The post రామ్ లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లేడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రామ్, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు గుంటూరు వివిఐటి కాలేజ్‌లో విద్యార్థులతో కలిసి సందడి చేసింది చిత్ర బృందం. ఇక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “మణిశర్మ మా సినిమాకు పెద్ద పిల్లర్. అడిగిన వెంటనే ఐదు పాటలు మాకు ఇచ్చారు. ఈ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక రామ్‌తో తొలిసారి కలిసి పనిచేశాను. తనలో ఎనర్జీ అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. రామ్ ఓ గ్రేట్ యాక్టర్. అతని తెలంగాణ డైలాగ్స్ సినిమాకే హైలైట్. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది” అని అన్నారు. రామ్ మాట్లాడుతూ “థియేటర్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ప్రేక్షకులు రెండు గంటల పాటు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం నేను పనిచేసిన ఈ ఆరు నెలల కాలం నా లైఫ్‌లోనే బెస్ట్ టైమ్. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

నిధి అగర్వాల్ తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఈనెల 18న మా ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలవుతుంది”అని తెలిపారు. నిర్మాత ఛార్మి కౌర్ మాట్లాడుతూ “సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ఆతర్వాత సినిమాపై నమ్మకం మరింత పెరిగింది. సినిమా సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చింది. చూసేవాళ్లందరికీ ఫుల్ మీల్స్‌లాంటి సినిమా ఇది. రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటన చూసిన నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తను లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లేడు. అతనిది వన్ మ్యాన్ షో”అని పేర్కొన్నారు.

నిధి అగర్వాల్ మాట్లాడుతూ “నేను పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేయాలని ఎదురు చూశాను. కానీ తక్కువ సమయంలోనే ఆయనతో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. రామ్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. తను మంచి డ్యాన్సర్. తనలోని ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నభానటేశ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నభా నటేశ్, డ్యాన్స్ మాస్టర్ ఆనీ తదితరులు పాల్గొన్నారు.

 

There is no Ismart Shankar without Ram

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రామ్ లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లేడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: