జల్సాలకు అలవాటు…దొంగగా మారిన టెన్నిస్ కోచ్…

  కూకట్‌పల్లి : జల్సాలకు అలవాటు పడిన టెన్నిస్ కోచ్ దొంగగా మారి నమ్మిన వారింటిని కొల్లగొడుతూ సిసి కెమెరాల ద్వారా పోలీసులకు పట్టుబడిన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది. బుధవారం కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్‌రావు, కూకట్‌పల్లి ఏసిపి సురెందర్‌రావు, కెపిహెచ్‌బి సిఐ లక్ష్మీనారాయణలు వివరాలను వెల్లడించారు. ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్బారావు పేట్‌కు చెందిన కోమలి రామకృష్ణ (24) గత […] The post జల్సాలకు అలవాటు… దొంగగా మారిన టెన్నిస్ కోచ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కూకట్‌పల్లి : జల్సాలకు అలవాటు పడిన టెన్నిస్ కోచ్ దొంగగా మారి నమ్మిన వారింటిని కొల్లగొడుతూ సిసి కెమెరాల ద్వారా పోలీసులకు పట్టుబడిన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది. బుధవారం కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్‌రావు, కూకట్‌పల్లి ఏసిపి సురెందర్‌రావు, కెపిహెచ్‌బి సిఐ లక్ష్మీనారాయణలు వివరాలను వెల్లడించారు.

ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్బారావు పేట్‌కు చెందిన కోమలి రామకృష్ణ (24) గత మూడు సంవత్సరాలుగా కూకట్‌పల్లిలోని శాతవాహన నగర్‌లోగల ఇంటి నెం.245లో నివసముంటూ అదే కాలనీలోని టెన్నిస్ కోట్‌లో కోచ్‌గా వ్యవహరించేవాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన రామకృష్ణ దొంగతనాలు చేయసాగాడు. గతంలో రాజమండ్రి తదితర ప్రాంతాల్లో 4 దొంగతనం కేసుల్లో రామకృష్ణ నిందితుడిగా ఉన్నాడు.

హైదరాబాద్ వచ్చిన రామకృష్ణ శాతవాహన నగర్ టెన్నిస్ కోట్‌లో కోచ్‌గా చేరి తన వద్ద టెన్నిస్ నేర్చుకునేందుకు వచ్చే వారితో చనువు పెంచుకుని వారి కుటుంబంలో ఒకడిగా కలిసి పోతాడు. ఇంట్లో వారు బయటకు వెళ్లే సమయంలో ఇంటి తాళం చెవిని ఎక్కడ పెట్టేది, ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉండేది గమనిస్తూ అదును చూసి దొంగతనానికి పల్పడుతాడు. ఇదే క్రమంలో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరధిలో జరిగిన రెండు దొంగతనాలకు పాల్పడిన రామకృష్ణను సిసి కెమెరాల ద్వారా గుర్తించి అరెస్టు చేసి ఆరా తీయగా తాను గతంలో చేసిన దొంగతనాలతో పాటుగా ఇక్కడ చేసిన రెండు దొంగతనాలకు సంబంధించిన విషయాలను పోలీసులకు తెలిపాడు.

రామకృష్ణ వద్ద నుంచి సుమారు 5 లక్షల విలువగల బంగారు ఆభరణాలతో పాటుగా కిలోన్నర వెండి వస్తువులు, ఒక ల్యాప్ టాప్, ఒక మిక్సర్ గ్రైండర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి రామకృష్ణను అరెస్టు చెసిన కెపిహెచ్‌బి పోలీస్ సిబ్బందిని డిసిపి వెంకటేశ్వర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.

The Tennis Coach Turned into a Thief

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జల్సాలకు అలవాటు… దొంగగా మారిన టెన్నిస్ కోచ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: