‘ది స్కై ఈజ్ పింక్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

The Sky Is Pinkముంబయి : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక 21 ఏళ్ల కూతురు ఉన్న తల్లి పాత్రలో నటిస్తున్నారు. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జైరా వసీమ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రియాంక తల్లి పాత్రలో జరీనామా నటిస్తోంది. వచ్చే నెల 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను విడుదల చేశారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో ‘దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో’ అనే సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ‘ది స్కైజ్ ఈజ్‌ పింక్’ లో రెండోసారి కలిసి నటిస్తున్నారు.

The Sky Is Pink Trailer Release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ది స్కై ఈజ్ పింక్’ ట్రైల‌ర్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.