మాధాపూర్ లో వేగంగా భూగర్భ డ్రైనేజి పనులు…

  మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో భూగర్భ డ్రైనేజి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డ్రైనేజి సమస్యలతో కాలనీ వాసులు ఎదుర్కోంటున్న ఇబ్బందులను గుర్తించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆదిత్యనగర్, కృష్ణ కాలనీలకు 60లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న కాలనీ వాసుల మంజూరైన నిధుల ద్వారా డ్రైనేజీకి శాశ్వత పరిష్కరంకు కృషి చేస్తున్నందున కాలనీ వాసులు హర్షం వ్యక్తం […] The post మాధాపూర్ లో వేగంగా భూగర్భ డ్రైనేజి పనులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో భూగర్భ డ్రైనేజి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డ్రైనేజి సమస్యలతో కాలనీ వాసులు ఎదుర్కోంటున్న ఇబ్బందులను గుర్తించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆదిత్యనగర్, కృష్ణ కాలనీలకు 60లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న కాలనీ వాసుల మంజూరైన నిధుల ద్వారా డ్రైనేజీకి శాశ్వత పరిష్కరంకు కృషి చేస్తున్నందున కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వేసిన పైప్‌లైన్‌లు ఆస్తవ్యస్తంగా ఉండటంతో వాటి స్థానంలో నూతన పైప్‌లైన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహర్నిశలు శ్రమిస్తు అభివృధ్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఆదిత్యనగర్, కృష్ణ కాలనీలో చాలా సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకొకపోవడంతో స్థానిక ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గం ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌లు కాలనీ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తు నిధుల మంజూరుకు సహకరించారు. దీంతో అధికారులు గతంలో వేసిన పైప్‌లైన్‌లు అస్తవ్యస్తంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాత పైప్‌లైన్‌ల స్థానంలో నూతన పైప్‌లైన్‌ల ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్థానిక కాలనీల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలకు శాశ్వత పరిష్కరంకు ప్రత్యేక కృషి…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్, నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపూడి గాంధీల సహకారంతో అభివృద్ధికి సరిపడా నిధులను మంజూరు చేయడంతో కాలనీలకు మౌళిక వసతుల కల్పానే ధ్యేయంగా ముందుకు సాగుతు సమస్యల పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆదిత్యనగర్, కృష్ణ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతుండటంతో వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్‌ల సహకారంతో డివిజన్ అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఆదిత్యనగర్, కృష్ణ కాలనీలకు 60లక్షల నిధులతో 900 మీటర్ల పోడవున కాలనీలో అధికారులు పాత పైప్‌లైన్‌ల స్థానంలో నూతన పైప్‌లైన్‌లను ఏర్పాటు చేచడం జరుగుతుందన్నారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్.
వేగంగ జరుగుతున్న డ్రైనేజి పనులు…
గత కొన్ని సంవత్సరాలుగా ఆదిత్యనగర్, కృష్ణ కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోనేవారు. గతంలో వేసిన పాత పైప్‌లైన్‌లతో డ్రైనేజి పొంగి రోడ్లపై పారుతుండేది. దీంతో కాలనీలో డ్రైనేజీ సమస్య అధికం అవుతుండేది. కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ దృష్టికి తీసుకుపోవడంతో సానుకులంగా స్పందించి డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయించి కాలనీలకు శాశ్వత పరిష్కరంకు కృషి చేయడం జరుగుతుందన్నారు.

 

The rapid underground drainage tasks in Madhapur

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మాధాపూర్ లో వేగంగా భూగర్భ డ్రైనేజి పనులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: