హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి జనతానగర్‌లో డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఇంటింటా నిర్వహించిన సోదాల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 29 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మేడ్చల్ మండలం బండ్లగూడలో మల్కాజ్గిరి డిసిపి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
comments