శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

 Sriramsagar

 

మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, బాలేగవా ప్రాజెక్టుల ద్వారా నీరు విడుదల

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ఉన్న మహారాష్ట్ర, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుండి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు వరద 42 గేట్లను ఎత్తి శనివారం 8.40 గంటలకు 2లక్షల క్యూసెక్కుల వరదనీటిని గోదావరిలోకి వదిలినట్లు ఏఈఈ మహేందర్ తెలిపారు. దీంతో గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విష్ణుపురి, గైక్వాడ్, అముదురా, బాలేగావ్ ప్రాజెక్టుల నుండి భారీగా నీటి విడుదల జరుగుతుంది. అదే విధంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లా పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలకు వదరనీరు వచ్చి చేరుతోందన్నారు. ఎగువ నుండి భారీగా వరదనీటిని ప్రాజెక్టుల నుండి విడుదల చేశారు.

ఎస్సారెస్పీ నీటిమట్టం సమంగా నిర్వహణ చేయడంతో ఎగువ నుండి వరదనీరు ప్రాజెక్టులోకి చేరుకోవడం లేదన్నారు. దీంతో ప్రాజెక్టు ఎగువనున్న ప్రాంతాలు జలమయయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామాలు వరదనీటితో ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర ప్రాజె క్టు అధికారులు విన్నపంతో ముందస్తుగా ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. ఎస్సారెస్పీ ఎగు వ నుండి 1,19,700క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చిచేరుతోందని ఏఈఈ తెలిపారు. మిగులు జలాలను శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం 8గంటల వరకు 26వరద గేట్లతో 1లక్ష క్యూసెక్కుల నీటిని విడుద ల చేశారు. 8.40 నిమిషాలకు ప్రాజెక్టుకు ఉన్న పూర్తి వరద 42 గేట్లతో 1,50,500 క్యూసెక్కుల నీటిని వదిలా రు.

11గంటలకు 39 గేట్లతో 2లక్షల క్యూసెక్కులు 5గంటల వరకు కొనసాగింది. అనంతరం 5.30 నిమిషాలకు 39 గేట్లతో 1,50,000క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. అదే విధంగా కాకతీయ కాలువకు 5,500, సరస్వతి కాలువకు 800, ఎస్కేప్ గేట్లతో 2500 క్యూసెక్కులను నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టిఎంసిలు శనివారం సాయంత్రానికి 1089.70 అడుగులు (83.253 టిఎంసిలు) నీటి నిల్వ ఉందన్నారు.

The ongoing flood to Sriramsagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.