చావు ఒక్కటే పరిష్కారమా… ?

Life

 

నిజామాబాద్ : క్షణికావేశం…. జీవితాన్ని చిదిమేస్తుంది. కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించాలి… ఆత్మ విశ్వాసం గెలుపుకు బాట వేస్తుంది. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు.
సమస్యలు… ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా కారణాలతో నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. జీవితంలో కష్టాలకు, సమస్యలకు ఎదురీదకుండా చావు ఒక్కటే పరిష్కారమనుకుంటున్నారు. కష్టాలు వచ్చాయని తమకు నష్టాన్ని కలుగచేసారని బాధతో, కక్షలతో జీవితాన్ని మద్యలో తుంచేసుకుంటున్నారు. ఎందుకిలా జరుగుతోంది…? పుట్టుక, మరణం పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు.. అనేది అందరికి తెలిసిందే. మానవ జీవితం ఒక అద్బుతమని, ఈ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి.

ఆత్మహత్యలు అధికం 
ప్రస్తుతం మారుతున్న సమాజంలో మరణాల సంఖ్య అధికమవుతున్నాయి. కక్షలు, కార్పణ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు రావడంతో చావు ఏకైక మార్గమని అనుకుంటున్నారు. ఎదురుదెబ్బలకు తట్టుకుని ధైర్యంగా నిలబడకుండా జీవితంలో కష్టాలు వచ్చాయని, వాటిని భరించలేమని ఆందోళన చెందుతూ జీవితాన్ని అంతం చేసుకోవడం మూర్ఖత్వం అనగా ఇంకేమనాలి.

బలహీనత
చేసే పనుల్లో నిజాయితి ఉండేలా, తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇతర వ్యక్తులతో చక్కటి సత్సంబంధాలు ఉండేలా చూడాలి. చావు సంగతి సరే… నీపై ఆధారపడిన వారికి ఏం సమాధానం చెబుతారు ? నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు మనస్సులో పిచ్చిపిచ్చి ఆలోచనలు పరిభ్రమిస్తాయి. ఆ క్షణంలో బలహీనపడ్డామంటే మాత్రం అంతే సంగతులు. ప్రతి సమస్యకు చావుతోనే సమాధానం వెతుక్కుంటారా? ఆలోచన వచ్చిందే తడువుగా అఘాయిత్యానికి పాల్పడకుండా తమకు తాము ఓ గడువు విధించాలని మానసిక విశ్లేషకులు సూచిస్తుంటారు.

భయాన్ని వీడాలి
భయం.. మరింత భయాన్ని కలుగచేస్తుంది. ఓ చిన్న భయం బతుకంతా వ్యాపింపజేస్తుంది. భయం సకల సమస్యలకు మూలంగా తయారవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భయం నీడలాంటిందని చెప్పవచ్చు. అది నీడలా వెంటాడుతుంది. ధైర్యంగా పోరాడటం భయాన్ని పారదోలే విధంగా మానసికంగా ధృడంగా తయారుకావాలి. చిన్న సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం అనేది దాని నుండి బయటపడాలి. తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న వారితో సాంత్వన చేకూర్చేలా మాట్లాడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, కౌన్సిలింగ్ చేయాలి, మానసిక వైద్య నిపుణుడు వద్దకు తీసుకెళ్లడం చేస్తే పరిస్థితిలో నుండి మార్పు వస్తుంది.

The Momentary Rage kills Life

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చావు ఒక్కటే పరిష్కారమా… ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.