విజువల్ వండర్ ‘ద లయన్ కింగ్’

  క్రూర మృగాలు మనుషుల వలే మాట్లాడతాయి… మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదైనా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. ఇదంతా డిస్నీ వాళ్లు తయారుచేసిన ‘ద లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. లయన్ కింగ్ కథకు హీరో ఈ సింబ. అలాగే టిమోన్ అనే ముంగిస, పుంబా అనే […] The post విజువల్ వండర్ ‘ద లయన్ కింగ్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రూర మృగాలు మనుషుల వలే మాట్లాడతాయి… మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదైనా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. ఇదంతా డిస్నీ వాళ్లు తయారుచేసిన ‘ద లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. లయన్ కింగ్ కథకు హీరో ఈ సింబ. అలాగే టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది ఈ కథలో ముఖ్య పాత్రలు. కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమా ‘లయన్ కింగ్’ ఈనెల 19న విడుదల కానుంది. ఈ విజువల్ వండర్‌కు రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సికా, అలీ, బ్రహ్మానందం తమ గాత్రాలను అందించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ “రాజమౌళి చిత్రంలో ఈగకు డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ అందులో ఈగకు మాటలు ఉండవు. దాంతో నా కోరిక తీరలేదు. కానీ ‘అ’ చిత్రం ద్వారా చేపకు, ‘ద లయన్ కింగ్’ ద్వారా సింహానికి డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు దక్కింది”అని అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ “ఒకప్పుడు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నా వాయిసే నాకు మైనస్ అన్నారు. కానీ ప్రస్తుతం నా వాయిస్ నన్ను ఎక్కడికో తీసుకువెళ్తోంది. డిస్నీ వారి నుంచి నాకు ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అలీ, రవిశంకర్, లిప్సికా తదితరులు పాల్గొన్నారు.

The Lion King movie is set for release on July 19

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విజువల్ వండర్ ‘ద లయన్ కింగ్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: