సిర్పూర్ పేపర్ మిల్లులో కొనసాగుతున్న జేకే బృందం సర్వే

మన తెలంగాణ/కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని మూతబడిన సిర్పూర్ పేపర్‌మిల్లును నడిపేందుకు ముందుకు వచ్చిన జేకే పేపర్ మిల్స్ కంపెనీ ప్రతి నిధుల బృందం సర్వే కొనసాగుతోంది. తాజాగా గురువారం కూడా జేకే పేపర్ కంపెనీ ప్రతినిధులు సిఎల్‌ఓ 2 ప్లాంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. గత మూడు రోజుల నుండి మిల్లులోని ఆయా విభాగాల్లో జేకే ప్రతినిధులతో పాటు నిపుణుల బృందం సభ్యులు సర్వే చేపడుతున్నారు. జేకే కంపెనీ చీఫ్ ఇంజనీర్ ప్రోసెస్ ఫణిగ్రహ్, ప్రాజెక్టు పల్ప్ మిల్ […]

మన తెలంగాణ/కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని మూతబడిన సిర్పూర్ పేపర్‌మిల్లును నడిపేందుకు ముందుకు వచ్చిన జేకే పేపర్ మిల్స్ కంపెనీ ప్రతి నిధుల బృందం సర్వే కొనసాగుతోంది. తాజాగా గురువారం కూడా జేకే పేపర్ కంపెనీ ప్రతినిధులు సిఎల్‌ఓ 2 ప్లాంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. గత మూడు రోజుల నుండి మిల్లులోని ఆయా విభాగాల్లో జేకే ప్రతినిధులతో పాటు నిపుణుల బృందం సభ్యులు సర్వే చేపడుతున్నారు. జేకే కంపెనీ చీఫ్ ఇంజనీర్ ప్రోసెస్ ఫణిగ్రహ్, ప్రాజెక్టు పల్ప్ మిల్ జనరల్ మేనేజర్ గురునాథ్ రెడ్డి, ప్రతి నిధులు రంగా రావు, గంగారాం తదితరులు సిఎల్‌ఓ ప్లాంట్‌ను పరిశీ లించారు.  సిర్పూ ర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా జేకే కంపెనీ అధికా రుల పర్యటనలు, సర్వేలతో ఒక వైపు కార్మికుల్లో మరో వైపు పట్టణ ప్రజల్లో హర్షం వ్యక్తంమవుతోంది. త్వరలోనే జేకే కంపెనీ బృందం సర్వేను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. పేపర్ మిల్లు పునః ప్రారంభం కోసం మార్గం సుగ మం అవు తుండటంతో ముఖ్యంగా కార్మికులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. గురు వారం నాటి సర్వేలో కార్మిక సంఘం నేత ఇందారప్ రాజేశ్వర్ రావు, రమణా రావు, నయీం, అమర్ కుమార్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: