ప్రభుత్వం చొరవ వల్లే ఎస్‌పిఎం పునః ప్రారంభం

మన తెలంగాణ/కాగజ్‌నగర్: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ చొరవ వల్లే కుమురం భీం ఆసిపాబాద్ జిల్లాలో మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభానికి రంగం సిద్ధమైందని రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఎస్పీఎం విజయోత్సవ ర్యాలీ అనంతరం స్థానిక వాసవీ గార్డెన్స్‌లో ఎస్పీఎం కార్మికులు, […]

మన తెలంగాణ/కాగజ్‌నగర్: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ చొరవ వల్లే కుమురం భీం ఆసిపాబాద్ జిల్లాలో మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభానికి రంగం సిద్ధమైందని రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఎస్పీఎం విజయోత్సవ ర్యాలీ అనంతరం స్థానిక వాసవీ గార్డెన్స్‌లో ఎస్పీఎం కార్మికులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు, రైతులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ శాస నసభ్యులు కోనేరు కోనప్ప పేపర్ మిల్లును పునః ప్రారంభించేందుకు తీవ్ర కృషి చేశారని, గత నాలుగేళ్ల నుండి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌తో పాటు పలు శాఖల మంత్రులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వేర్వేరుగా కలుస్తూ మిల్లు పునరుద్ధరణ కోసం అభినందించదగ్గ ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తీవ్ర కృషి ఫలితం కారణంగానే ప్రస్తుతం సిర్పూర్ పేపర్ మిల్లు ద్వారాలు తిరిగి తెరుచుకొని పేపర్ ఉత్పత్తి ప్రారంభం కాబోతోందని అన్నారు. శాసన సభ సాక్షిగా మంత్రి కెటిఆర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషిని కొనియాడారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. పేపర్ మిల్లు మూతబడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు లేక వారు ఎదుర్కొన్న సమస్యలను లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్న జననేత కోనేరు కోనప్పను ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ  ఆశీర్వాదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పేపర్ మిల్లు ప్రారంభమై, కాగితపు ఉత్పత్తి ప్రారంభమవుతోందని మంత్రి చెప్పారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా పేపర్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని, ప్రస్తుతం అమలవుతున్న పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయని అన్నారు. వేలాది మందికి అన్నం పెట్టి మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు.
ఇలాంటి ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజలకు దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని అభివర్ణించారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల పక్షాన ఉంటూ తమ ప్రభుత్వం పని చేస్తోందని హామి ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ మిల్లు అంశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అనేక దుష్ప్రచారాలు చేశారని, కానీ సత్యం గెలించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, రాష్ట్ర నాయకులు అరిగెల నాగేశ్వర్ రావు, ఇంచార్జి మూల విజయరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Related Stories: