రైతు రుణం తీర్చుకుంటున్న టిఆర్‌ఎస్

పెట్టుబడి సాయంతో రైతుల్లో పెరిగిన ధీమా రైతు బీమా కింద 2.77 లక్షల మంది రైతుల గుర్తింపు ఇప్పటి వరకు 1.81 మంది రైతులకు ఇన్య్సూరెన్స్ నమోదు ఆగస్టు 15 నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లింపులు రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : రైతే రాజు.. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు.. అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న గత పాలకులను చూశాం.. అయితే వాస్తవంగా రైతులు క్షేత్ర స్థాయిలో […]

పెట్టుబడి సాయంతో రైతుల్లో పెరిగిన ధీమా
రైతు బీమా కింద 2.77 లక్షల మంది రైతుల గుర్తింపు
ఇప్పటి వరకు 1.81 మంది రైతులకు ఇన్య్సూరెన్స్ నమోదు
ఆగస్టు 15 నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లింపులు
రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : రైతే రాజు.. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు.. అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న గత పాలకులను చూశాం.. అయితే వాస్తవంగా రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమే. సాగునీటి నుంచి మొదలుకొని పంటల పెట్టుబడి వరకు అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం ద్వారా ప్రత్యక్షంగా రైతు రుణం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.  కేవలం నాలుగు సంవత్సరాల కాలం లోనే రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని చెప్పవచ్చు. అన్ని రాష్ట్రా లు అబ్బురపడే విధంగా రైతుబంధు పథకం, రైతుబీమా పథకం ప్రవేశ పెట్టడంతో రైతు ల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో బ్యాంకుల రుణం సక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుంటూ వ్యవసాయం చేసిన రైతులు చివరికి కష్టం కూడా మిగలని పరిస్థితి ఉండేది. అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకం ద్వారా ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాకే రూ. 356 కోట్లు కేటాయించడం సంబ్రామాశ్చార్యానికి గురి చేసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టని విధం గా ఈ విన్నూత్న కార్యక్రమానికి ప్రభుత్వం తెరతీసింది. రుణ మాఫీ అంటూ గత పాలకులు రైతులను ఆదుకోకుండా ప్రగల్బాల ద్వారా కాలయాపన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏడాదికి పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 8 వేలు చొప్పున ఎలాంటి బ్యాంకుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు చెల్లించడం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతన్న సంతోషంతో వ్యవసాయం పనుల్లో నిమగ్నమయ్యారు. గత మే 10 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణా ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. పెట్టుబడి సహాయాం కింద రూ.356 కోట్లు జిల్లాకు మంజూరు కాగా, ఇందులో 80శాతం వరకు రైతులకు చెక్కుల పంపిణీ చేశారు. మరో 20 శాతం చెక్కుల పంపిణీ జరగాల్సి ఉంది. భూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు,ఒప్పులు సరి చేసే ప్రక్రియ కొనసాగుతున్నందున రైతులకు ఈ చెక్కులు తాత్కాలికంగా నిలిపి వేశా రు. అయితే ఈ పథకానికి వెన్నుదన్నుగా జూన్ 11న రైతు భీమా పథకాన్ని ముఖ్యమం త్రి కెసిఆర్ చేపట్టి రైతులకు మరింత చేరువయ్యారు.గతంలో రైతు మరణించినా ఆయన కుటంబానికి ఎలాంటి ఆదరణ లేదు. అయితే గత పాలకులు అరకొర నిధులు కేటాయించి రైతులను పట్టించుకోక పోవడం వలన వ్యవసాయం మాని వలసలు వెళ్లిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ సారి అలా జరగకుండా 18 సంవత్సరాల పై నుంచి 55 సంవత్సరాల లోపు వయసు గల రైతులందరికి ఈ భీమా వర్తించేలా ఎల్‌ఐసి ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతు సహజంగా మరణించినా, ప్రమాదవ శాత్తు మరణించినా వారి కుటుంబంలో భరోసా కల్పించేందు కోసం రూ. 5 లక్షలు భీమా మొత్తం మృతుని నామినికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతు బీమా పథకం కింద ఒక్కొక్క రైతుకు రూ. 2170 చొప్పున ప్రభుత్వం ఎల్‌ఐసికి ప్రీమియంను ఆగస్టు 15 నాటికి చెల్లించనుంది. రైతు భీమా కింద ఇప్పటి వరకు జిల్లాలో 2.77 లక్షల మంది రైతులను అధికారులు గుర్తించారు. అందులో 1.81 వేల మంది రైతుల నామినీలను నమోదు చేశారు.మిగిలిన వారిని కూడా త్వరలో గుర్తించి నిర్ణీత గడువులోగా నమోదు చేయనున్నారు. ఈ పథకం ఇన్సూరెన్స్ పత్రాలు ఆగస్టు 15న జిల్లాలో రైతులందరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేస్తోంది. ఆగ స్టు15 తర్వాత జిల్లాలో ఏ రైతు అయినా మరణించినా ఈ రైతు భీమా సొమ్మును పది రోజుల్లో బాధిత మృతుని నామినికి ఎల్‌ఐసి చెల్లించనుంది. రైతు చనిపోయిన వివరాలను పది రోజుల్లోగా ఎల్‌ఐసికి ఇవ్వక పోతే సంబందిత అధికారి జీతంలో నుంచి కోత విధించనున్నారు. జిల్లాలో 26 మండలాల పరిధిలో అర్హులైన రైతుల వివరాలను ఇప్పటికే సేకరించిన వ్యవసాయశాఖ అధికారులు రైతు భీమా, రైతు బంధు పథకంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.రెవెన్యూ శాఖ సహాకారంతో పట్టెదారు పాసుపుస్తకాల ఆధారంగా నిజమైన భూ యజమానులకు పెట్టబడి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సంబందిత అధికారులతో చర్చించి ఈ పథకాన్ని పకడ్భంధిగా అమలు చేసేలా ఆదేశిస్తున్నారు.

Related Stories: