వేగంగా దుర్గం చెరువు కేబుల్ వంతెన పనులు…

మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రోజు రోజుకు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబద్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణాంతో పాటు అండర్ పాస్‌లు నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంకు చర్యలు తీసుకుంది. 2017 సంవత్సరంలో ఎస్‌ఆర్‌డిపి […] The post వేగంగా దుర్గం చెరువు కేబుల్ వంతెన పనులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రోజు రోజుకు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబద్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణాంతో పాటు అండర్ పాస్‌లు నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంకు చర్యలు తీసుకుంది.

2017 సంవత్సరంలో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్ ద్వారా 184 కోట్ల రూపాయలతో జుబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి దుర్గం చెరువుపై నుంచి ఇనార్బిట్ మాల్ వరకు గల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పనులను ఎల్ అండ్ టి కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం 2019 సంవత్సరం చివరికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కేబుల్ బ్రిడ్జి పనులకు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణంలో అడ్డంకులు వచ్చినా, కోర్టు కేసులు ఉన్నా కేసులను పరిష్కారం చేసుకుంటు నిర్మాణ పనులలో వేగం పెంచి పనులను చేస్తున్నారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టి హబ్ ద్వారా నగరంకు అనేక జాతీయ, అంతర్జాతీయ సాప్ట్‌వెర్ కంపెనీలు ముందుకు రావడంతో ఐటీ కారిడార్ ప్రాంతమైన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ సంస్థలలో లక్షల మంది సాప్ట్‌వెర్ ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో ఐటీ కారిడార్ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్యతో ఉద్యోగులు ఇబ్బందులకు గురైతున్నారు. దీనికి తోడు రోడ్డులు చిన్నగా ఉండటం కూడ  సమస్యగా మరింది. వీటన్నింటి పరిష్కారంకు రోడ్డులను వెడల్పు చేయడం, ఐటీ కారిడార్ ప్రాంతంలో ఫ్లైఒవర్ బ్రిడ్జిల నిర్మాణం చేయడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది.

దుర్గం చెరువుపై వంతెన నిర్మాణం చేయడంతో దుర్గం చెరువుకు కొత్త అందాలు రావడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే దుర్గం చెరువును రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక, నీటిపారుదలశాఖలు దుర్గం చెరువులో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.

రహేజా కార్ప్ సంస్థ సహకారంతో 12 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 2.2 కిలోమిటర్ల పోడవుతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ స్టాండ్స్‌లను పూర్తి చేయడం జరిగింది. నూతన టెక్నాలజీతో పనిచేసే రెండు ఎంట్రన్స్ ప్లాజాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిల్పాలు దుర్గం చెరువుకు కొత్త అందాలను తీసుకువచ్చాయి. సేప్టి రెయిలింగ్, ఫెన్సింగ్ వర్క్, ఎలక్రిసిటీ లైటింగ్, ల్యాండ్ స్కేపింగ్ అండ్ ప్లాంటేషన్, స్టోన్ పిచ్చింగ్ ఫర్ స్లోప్స్‌లతో పాటు ఒపెన్ ఎంబర్ బిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టాయిలెట్ బ్లాక్స్, ఓపెన్ లైబ్రరీ, లేక్ క్లీనింగ్ ఇన్‌లెట్ ఇంప్రూవ్‌మెంట్ చేయడం జరిగింది.

దీంతో దుర్గం చెరువు పూర్తిగా ఆకుపచ్చగా మరి మరింత అభివృద్ధి చెందుతుంది. ల్యాండ్ స్కేప్‌లతో ప్రధాన ఆకర్షణగా దుర్గం చెరువు రూపుదిద్దుకుంది. శరీరానికి ఉపశమనం కలిగించే ఉత్సాహభరిత వాతావరణం దుర్గం చెరువు రూపురేఖలు మారిపోయయి. దుర్గం చెరువుపై కేబుల్ వంతేన పనులు పూర్తి అయితే హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుంది, ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనదారులు, ఐటీ ఉద్యోగులకు సులువుగా ప్రయాణం సాగిపోతుంది.

The faster the cable bridge construction

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేగంగా దుర్గం చెరువు కేబుల్ వంతెన పనులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: