చల్లదనాన్నిచ్చే కీర!

  ఈ వేసవి ఎండలకు కీర దోస తింటే శరీరానికి చల్లదనం ఇంకా ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ఇది చర్మాన్ని పరిరక్షించగలుగుతుంది. కీరా లో 90శాతం నీరు ఉండటం వల్ల వేసవి వేడికి శరీరం కోల్పోయిన నీటిని ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేయగలుగుతుంది. చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది. ఎండకు చర్మం కందిపోయి మంట పెడుతూ ఉంటే కీరా ముక్కతో రుద్దితే పోతుంది. ట్యాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. గోళ్ళు చిట్లి పోకుండా ఉంటాయి. కళ్ళు […] The post చల్లదనాన్నిచ్చే కీర! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ వేసవి ఎండలకు కీర దోస తింటే శరీరానికి చల్లదనం ఇంకా ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ఇది చర్మాన్ని పరిరక్షించగలుగుతుంది. కీరా లో 90శాతం నీరు ఉండటం వల్ల వేసవి వేడికి శరీరం కోల్పోయిన నీటిని ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేయగలుగుతుంది. చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది. ఎండకు చర్మం కందిపోయి మంట పెడుతూ ఉంటే కీరా ముక్కతో రుద్దితే పోతుంది. ట్యాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. గోళ్ళు చిట్లి పోకుండా ఉంటాయి. కళ్ళు అలసటతో ఉబ్బినట్లు ఉంటే కీర దోసను పల్చని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచి, ఆ చల్లని ముక్కలను కాటన్ వస్త్రంలో వేసి కళ్లపై పెట్టుకొంటె మంచి ఫలితం ఉంటుంది. కీర దోస తొక్కలో విటమిన్ కె, సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తొక్కతో పాటు తింటే మంచిది.

The coolest keera kukumber

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చల్లదనాన్నిచ్చే కీర! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.