రైతుల పంటలను కాటేస్తున్న షుగర్‌ఫ్యాక్టరీ కాలుష్యం

ఫ్యాక్టరీ వ్యర్థపదార్థాలతో .. దిగుబడి రాక అయోమయంలో పడ్డ రైతులు రైతుల బోరుబావుల నుండి వస్తున్న రంగునీళ్లు భూసారం క్షీణించి ఎండిపోతున్న పంటలు మన తెలంగాణ/కొత్తకోట: పచ్చని పంటలను షుగర్‌ఫ్యాక్టరీ కాలుష్యం కాటువేస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పడితే ఈప్రాంతం ఎంతో అభివృద్ధి అవుతుందని రైతులను నమ్మించి పరిశ్రమను ఏర్పాటు చేశారు. బాగుపడే సంగతి అటుంచుతే షుగర్‌ఫ్యాక్టరీ సమీపంలో భూములు కల్గియున్న ముమ్మళ్లపల్లి గ్రామ రైతులు ఆందోళన బాట పట్టే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాల నుండి […]

ఫ్యాక్టరీ వ్యర్థపదార్థాలతో .. దిగుబడి రాక అయోమయంలో పడ్డ రైతులు
రైతుల బోరుబావుల నుండి వస్తున్న రంగునీళ్లు
భూసారం క్షీణించి ఎండిపోతున్న పంటలు

మన తెలంగాణ/కొత్తకోట: పచ్చని పంటలను షుగర్‌ఫ్యాక్టరీ కాలుష్యం కాటువేస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పడితే ఈప్రాంతం ఎంతో అభివృద్ధి అవుతుందని రైతులను నమ్మించి పరిశ్రమను ఏర్పాటు చేశారు. బాగుపడే సంగతి అటుంచుతే షుగర్‌ఫ్యాక్టరీ సమీపంలో భూములు కల్గియున్న ముమ్మళ్లపల్లి గ్రామ రైతులు ఆందోళన బాట పట్టే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాల నుండి షుగర్‌ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న భారీ వ్యర్థ పదార్థాలు భూమిలోకి ఇంకిపోవడంతో ఫ్యాక్టరీ సమీపంలోని రైతుల బోరు బావుల నుండి రసాయనాలతో కూడిన ఎర్రటి రంగునీళ్లు వస్తున్నాయి. రైతులు ఈ నీటితో పంటలను సాగుచేయగా పూర్తిగా పంట దిగుబడి రాకపోగా పెట్టుబడి పెట్టిన రైతులు లక్షల్లో నష్టపోయి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తమ భూములు ఇట్లయితే తమ బ్రతుకులు ఎట్ల అంటూ భవిష్యత్‌ను నెమరువేసుకొని రోధిస్తున్నారు. పిల్లా పాపలతో ఇక తమకు వలసే శరణ్యమౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని నాయిని నడిపి నాగన్న, ఆత్మకూర్ శ్రీనివాసులు, అడ్డాకుల నాగన్న, మిరాసిపల్లి గోపాల్, కావలి మున్నయ్య, మిరాసిపల్లి లక్ష్మన్న అనే రైతుల పొలాల్లో వేసిన బోరు బావుల నుండి రసాయనాలతో కూడిన నీరు విడుదల అవుతుంది. వరి నారుమల్లకు ,వరిపంటలకు ఈ నీటిని పారబెట్టిన పంటలకు పురుగు తగిలి వింత చీడపీడలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సంవత్సరాల కొద్ది 24 గంటల పాటున కాలుష్యం నీరు విడుదల కావడంతో రైతులు భవిష్యత్‌ను తలుసుకొని ఆందోళనకు గురౌతున్నారు. ఈ సమస్య ఇలా ఉంచితే అప్ప రాల, రామకృష్ణాపురం రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలకు కూడా ఇలాంటి ప్రమాదం పొంచిఉందని రైతులు,రైతుకూలీలు లబోదిబోమంటున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటున్న రైతులు..
షుగర్‌ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న రసాయనాలు భూమిలోకి ఇంకి తమ బోరు బావుల ద్వారా అవే రసాయనాలతో కూడిన నీరు సరఫరా కావడం వల్ల సాగుచేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని వెంటనే ఫ్యాక్టరీని నిలిపివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ,జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేయనున్నట్లు ముమ్మళ్లపల్లి గ్రామ రైతులు పేర్కొన్నారు. కలుషితం నీరు రావడం వల్ల ఎండిపోతున్న మొక్కలు, చెట్లు.. రవికుమార్ నాయుడు కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం (పొగ) ద్వారా పంట పొలాల్లో ఉండే చెట్లు, సమీపం లో ఉండే మొక్కలు, గుట్టపై ఉన్న మొక్కలు, చెట్లు కాలుష్యం (పొగ) ద్వారా చెట్లు ఎండిపోవడం జరుగు తుందని నాయిని రవికుమార్ నాయుడు అన్నారు.గ్రామ సమీపంలో ఉన్న కృష్ణవేణిఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం, దుర్వాసనలు, రైతులకు ,గ్రామాల్లోని నివాసాలకు దుర్వాసనను ప్రజలు భరించలేక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అధికారులు పట్టించుకోవాలని రవికుమార్ నాయుడు కోరారు.
బోరుబావి నుండి వచ్చే నీరును పశువులు తాగితే ..మృత్యువాత..

నడిపినాగన్న: రైతు..
కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గల రైతుల బోరు నుండి వెలువడే నీళ్లు పశువులు తాగితే పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతు నడిపి నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు రైతుల పొలాల్లోని ఉండే బోర్ల నుండి ఎర్రగా కలుషితంగా ఒక గంట సేపు వచ్చేవన్నారు. ప్రస్తుతం 24 గంటలు ఎర్రగా,కలుషితంగా బోరు నుండి నీళ్లు రావడంతో పశువులు, మనుషులు ఈ నీళ్లను తాగితే పలు వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు.

Comments

comments

Related Stories: