కత్తెరతో పొడిచి స్నేహితుడి దారుణ హత్య

  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిమ్మాపూర్ : కత్తెరతో పొడిచి ఓ యువకుడిని దారుణంగా హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కనపర్తి ప్రవీణ్, ఎర్రం అఖిల్ ఇద్దరు స్నేహితులు. శనివారం సాయంత్రం వారివురూ కలిసి మద్యం సేవించేందుకు వెళ్లి అక్కడ ఇద్దరు గొడవ పెట్టుకోవడంతో మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్, అఖిల్‌ను చంపుతానని బెదిరించడంతో అతడు అక్కడి […] The post కత్తెరతో పొడిచి స్నేహితుడి దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిమ్మాపూర్ : కత్తెరతో పొడిచి ఓ యువకుడిని దారుణంగా హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కనపర్తి ప్రవీణ్, ఎర్రం అఖిల్ ఇద్దరు స్నేహితులు. శనివారం సాయంత్రం వారివురూ కలిసి మద్యం సేవించేందుకు వెళ్లి అక్కడ ఇద్దరు గొడవ పెట్టుకోవడంతో మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్, అఖిల్‌ను చంపుతానని బెదిరించడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం ప్రవీణ్ తన ఇంట్లో నిద్రపోతుండగా అఖిల్ వెళ్లి కత్తెరతో ప్రవీణ్ కడుపులో పొడిచి పరారయ్యాడు. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

The Brutal Murder of a Friend with Scissors

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కత్తెరతో పొడిచి స్నేహితుడి దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: