విజృంభిస్తున్న డెంగీ మహమ్మారి

  అధికారుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి పేట్‌బషీరాబాద్ : నగరాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధితో ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే… జీడిమెట్ల గ్రామంలో నివాసం ఉంటున్న బేకు బాబు కుమారుడు ప్రవీణ్ కుమార్ (35) భార్య తేజస్వీని, పాప ఉద్వానిలతో కలిసి నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గత పది రోజుల క్రితం జ్వరం రావడంతో సమీపంలోని ఓ […] The post విజృంభిస్తున్న డెంగీ మహమ్మారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అధికారుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి

పేట్‌బషీరాబాద్ : నగరాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధితో ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే… జీడిమెట్ల గ్రామంలో నివాసం ఉంటున్న బేకు బాబు కుమారుడు ప్రవీణ్ కుమార్ (35) భార్య తేజస్వీని, పాప ఉద్వానిలతో కలిసి నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గత పది రోజుల క్రితం జ్వరం రావడంతో సమీపంలోని ఓ క్లీనిక్‌లో చూపించుకోగా తగ్గకపోవడంతో పేట్‌బషీరాబాద్‌లోని షెఫ్ ఆసుపత్రిలో చూపించుకున్నాడు.

దీంతో ఆసుపత్రి యజమాన్యం సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ అని తేల్చారు. దీంతో మంగళవారం ఉదయం చికిత్స పొం దుతూ మృతిచెందాడు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్షం కారణంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలలో రోడ్లపై ఏర్పడిన గుంటలలో నీరు నిల్వ ఉండడంతో పాటు ఖాళీ ప్రదేశాలలో చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు వృద్ధ్ది చెంది అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెత్త చెదారాన్ని తొలగించాలని పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పంది ంచి కాలనీలోని చెత్త చెదారంతో పాటు నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమలు వృద్ధిచెందకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

The Booming Dengue Epidemic

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విజృంభిస్తున్న డెంగీ మహమ్మారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.