400మంది యూనిట్ సభ్యులకు బంగారు ఉంగరాలు

Thalapathy-Vijayచెన్నై: తన కొత్త చిత్రం బిగిల్ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందరంగా తమిళ హీరో విజయ్ చిత్ర యూనిట్‌కు చెందిన 400 మందికి బంగారు ఉంగరాలను బహుకరించారు. మంగళవారం సాయంత్రం ఈ వార్త సోషల్ మీడియాలో వెల్లడై ఆ తర్వాత వైరల్‌గా మారింది. దీనిపై బిగిల్ నిర్మాతలైన ఎజిఎస్ సినిమాస్‌కు చెందిన అర్చనా కల్పతి ట్విట్టర్‌లో స్పందించారు. బిగిల్ చిత్రం కోసం 400 మంది యూనిట్ సభ్యులు పనిచేశారని, వారి శ్రమకు గుర్తింపుగా తలపతి విజయ్ ప్రత్యేక కానుకలు అందచేశారని చెప్పారు.

ఈ అభిమానానికి యూనిట్ సభ్యులందరూ ఆనందపడ్డారని కూడా ఆమె చెప్పారు. వచ్చే దీపావళికి విడుదల కానున్న బిగిల్ చిత్రానికి దర్శకుడిగా గతంలో విజయ్‌కు వరుసగా తెరి, మెర్సల్ వంటి రెండు సూపర్‌హిట్లు ఇచ్చిన అత్లీ పనిచేస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫుట్‌బాల్ కోచ్‌గా, లోకల్ రౌడీగా రెండు వైవిధ్యమైన పాత్రలలో విజయ్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడు.

Thalapathy Vijay gifts gold rings to Bigil unit members, Nayanathara is playing leading lady role in the film

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 400మంది యూనిట్ సభ్యులకు బంగారు ఉంగరాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.