10వ తరగతి విద్యార్థిని దారుణ హత్య…

Murderమహబూబ్‌నగర్: పదో తరగతి విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద చోటుచేసుకుంది. జడ్చర్లకు చెందిన బాలిక ఆగస్టు 26 నుంచి కనిపించకుండా పోవడం తో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గుర్తుతెలియని దుండగులు బాలికను బండరాయితో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నవీన్‌రెడ్డి అనే యువకుడు బాలికను హత్యచేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలింది. హైదరాబాద్‌కు చెందిన నవీన్‌రెడ్డి అనే వ్యక్తి విద్యార్థినికి ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Tenth Class Student Murder in Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 10వ తరగతి విద్యార్థిని దారుణ హత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.