టెన్షన్ తగ్గింది

Donald Trump

 

వాషింగ్టన్: భారత్ పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఇరుదేశాల మధ్య వేడి బాగా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాలూ ముందకు వస్తే వివాదాల పరిష్కారానికి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ మరోసారి వెల్లడించారు. భారత్ పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వ పాత్ర గురించి ఇంతకు ముందు ట్రంప్ ఒక కీలక ప్రకటన వెలువరించారు. ఇప్పుడు వైట్‌హౌస్ వద్ద ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. భారత్ పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు సడలుతున్న విషయాన్ని గమనించాల్సి ఉందని, ఇరు దేశాల మధ్య కశ్మీర్ వివాదం ఉందనేది అందరికీ తెలిసిందేనని ట్రంప్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బెడిసికొట్టాయి. సరిహద్దులలో ఉద్రిక్తతలకు దారితీసింది.

తనకు రెండు దేశాల గురంచి బాగా తెలుసునని, అందుకే సమస్య పరిష్కారానికి తాను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే వారి నుంచి ఈ ప్రతిపాదన రావాలని, ఈ విషయం రెండు దేశాల నేతలకూ బాగా తెలిసిందేనని ట్రంప్ విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ తెలిపారు. వారికి సహకారం అందించేందుకు ఇప్పటికీ సిద్ధం అన్నారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి మోడీ తనను అభ్యర్థించారని ట్రంప్ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఇటీవలే సంచలనం కల్గించాయి. అయితే దీనిపై వెంటనే భారత ప్రభుత్వం స్పందించింది. కశ్మీర్ ఇతర అంశాలు కేవలం ద్వైపాక్షికం అని, వీటిని ఇరు పక్షాలూ ఇతరుల ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటాయని పేర్కొన్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని సున్నితంగానే తోసిపుచ్చారు. అయితే గత నెలలో ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీతో సంభాషణల సందర్భంగటా ట్రంప్ కశ్మీర్ అంశాన్ని ఇరుదేశాలూ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవల్సిందే అన్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 ఎత్తివేత భారతదేశపు అంతర్గత వ్యవహారం అని కూడా స్పష్టం చేశారు.

Tension Reduced between India and Pakistan: Trump

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టెన్షన్ తగ్గింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.