హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక సిజె

జస్టిస్ చౌహాన్ నియామకానికి కొలీజియం సిఫార్సు న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల ఎంపికకు కొలీజియం పేర్లను ప్రతిపాదించిం ది. జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆర్‌ఎస్ చౌహాన్, మధ్యప్రదేశ్‌కు […] The post హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక సిజె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
జస్టిస్ చౌహాన్ నియామకానికి కొలీజియం సిఫార్సు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల ఎంపికకు కొలీజియం పేర్లను ప్రతిపాదించిం ది. జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆర్‌ఎస్ చౌహాన్, మధ్యప్రదేశ్‌కు ఎఎ ఖురేషీ, హిమాచల్ ప్రదేశ్‌కు వి రామసుబ్రమణియన్, ఢిల్లీ హైకోర్టు సిజెగా డిఎన్ పటేల్ పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని న్యాయమూర్తుల త్రిసభ్య ఎంపిక బృందమైన కొలీజియం ఈ పేర్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు సుప్రీం వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పేర్లను సిఫార్సు చేస్తూ , వారి పేర్ల ఎంపికకు కారణాలు , వారి నియామకాల అవసరం గురించి అధికారిక సమాచార వేదికలో వివరణ ఇచ్చుకున్నారు.

జస్టిస్ చౌహాన్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలలో ఉన్నారని, రాజస్థాన్ హైకోర్టుకు చెందిన ఆయన సీనియార్టీ జాబితాలో ముందున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ప్రత్యేకంగా ఇటీవలే ఏర్పాటు చేసినట్లు, అయితే పూర్తి స్థాయిలో సిజె నియామకం జరగ లేదని, ఈ దిశలో నియామకానికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం త్వరలోనే పూర్తి అవుతుందని, జస్టిస్ రాజేంద్ర మీనన్ రిటైర్మెంట్ కానుండటంతో ఈ స్థానంలో పటేల్ పేరును ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. గుజరాత్ హైకోర్టుకు చెందిన పటేల్ సీనియర్ అని, ప్రస్తుతం ఆయన జార్ఖండ్ హైకోర్టుకు బదిలీ అయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తాము సిఫార్సు చేసిన ఇతర పేర్లు వారి అనుభవం , ప్రధాన న్యాయమూర్తులుగా వారిని తీసుకోవల్సిన అవసరాన్ని కొలీజియం ప్రస్తావించింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతి వద్దకు పంపిస్తే ఈ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు వీలేర్పడుతుంది. ప్రధాన న్యాయమూర్తుల ఎంపికతో పాటు ఇద్దరు న్యాయవాదులను జడ్జిలుగా ఎంపికకు కూడా కొలీజియం సిఫార్సులు పంపించింది. విశాల్ ధగత్, విశాల్ మిశ్రాలను వారి అనుభవం ప్రాతిపదికన మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిలుగా తీసుకోవాలని సూచించింది.

Temporary CJ as High Court Chief Justice

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక సిజె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: