ఎండ దండయాత్ర

Temperatures to increase in next 5 days in TS

 

చేదువార్త తెలిపిన భారత వాతావరణ సంస్థ
రానున్న ఐదురోజులు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
తీవ్ర వడగాల్పులతో అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రామగుండం, ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతల ప్రాంతాల్లో ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా అవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తీవ్ర వడగాల్పుల తీవ్రత అధికం కావడంతో రాగల నాలుగైదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

శనివారం ఉష్ణోగ్రతలతో పోల్చితే ఆదివారం అధికం
జగిత్యాలలో 47. 2 డిగ్రీల ఉష్ణోగ్రత, పెద్దపల్లిలో 47.0, మంచిర్యాల 46.9, నల్లగొండలో 46.8, పెద్దపల్లిలో 46.7, భద్రాద్రి కొత్తగూడెంలో 46.5, జయశంకర్ భూపాలపల్లి 46.4, నిర్మల్ 46.4, మహబూబ్‌నగర్ 46.1, కామారెడ్డి 45.9, హైదరాబాద్ 44.8, మేడ్చల్ మల్కాజిగిరి 44.8, సంగారెడ్డి 44, రంగారెడ్డి 43.7, ఆదిలాబాద్ 46.3, భద్రాచలం 43.2, హన్మకొండ 44.5, ఖమ్మం 44.6, మెదక్ 44.2, నిజామాబాద్ 44.9, రామగుండం 45, కుమురంభీం ఆసిఫాబాద్45.5, సూర్యాపేట 44.6, ములుగు 44.5, నారాయణపేట 44.5, బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో 42.8, రాజేంద్రనగర్‌లో 42.5, హయత్‌నగర్‌లో 41.8, హకీంపేటలో 42.8, ఇక్రిశాట్ పటాన్‌చెరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శనివారం ఉష్ణోగ్రతలతో పోల్చితే ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు, రేపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు
ఆదివారం రాత్రి, సోమవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 26వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 3.1 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Temperatures to increase in next 5 days in TS

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎండ దండయాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.