అగ్ని గుండం

  జిల్లాల్లో భానుడి ప్రతాపం దంచి‘కొడుతున్న’ ఎండలు గడప దాటని జనం నాలుగు రోజులుగా నిప్పులకొలిమి ఇంకా పెరుగనున్న సూర్యప్రతాపం పరిషత్ ప్రచారంపై తీవ్ర ప్రభావం వడగాలులతో చిన్నారులకు, వృద్ధులకు చిక్కులు కరీంనగర్ 45.5 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల/ పెద్దపల్లి 45 డిగ్రీలు, జగిత్యాల 45.4 డిగ్రీలు, వేసవి కాలం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండలు ఎక్కువవుతుండటంతో ఉదయం 11 గంటలలోపే పనిని ముగించుకుని ఇంటికి చేరుకునే పరిస్థితి నెలకొంది. అత్యవసర పని […] The post అగ్ని గుండం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జిల్లాల్లో భానుడి ప్రతాపం
దంచి‘కొడుతున్న’ ఎండలు
గడప దాటని జనం
నాలుగు రోజులుగా నిప్పులకొలిమి
ఇంకా పెరుగనున్న సూర్యప్రతాపం
పరిషత్ ప్రచారంపై తీవ్ర ప్రభావం
వడగాలులతో చిన్నారులకు, వృద్ధులకు చిక్కులు

కరీంనగర్ 45.5 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల/ పెద్దపల్లి 45 డిగ్రీలు, జగిత్యాల 45.4 డిగ్రీలు,

వేసవి కాలం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండలు ఎక్కువవుతుండటంతో ఉదయం 11 గంటలలోపే పనిని ముగించుకుని ఇంటికి చేరుకునే పరిస్థితి నెలకొంది. అత్యవసర పని ఉంటే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని నిపుణులు చెప్తున్నారు. సూర్యోదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు దంచికొడుతున్నాయి. వీస్తున్న వడగాలులతో చిన్నారుల పట్ల, వృద్ధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచార సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ఉదయం పది గంటలలోపే ప్రచారాన్ని పూర్తి చేసి సాయంత్రం సమయం వరకు ఇంటి వద్దనే ఉండి ఫోన్‌ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అగ్నిగుండంగా మరింది.

కరీంనగర్ : గత నాలుగు రోజులు దంచికొడుతున్న ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఇంటి నుండి కాలు బయటపెట్టడానికే జనం జంకుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తుంది. 45 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రత నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నెలలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎండ తీవ్రతకు కూలర్లు, ఏసీలు కూడా పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎండతాకిడికి సమస్తజీవరాశులు సైతం తల్లడిల్లుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీళ్లు దొరక్క మృత్యువాతపడుతున్నాయి. పిట్టలు, పక్షులు, పిచుకలు ఎండతీవ్రతకు అక్కడిక్కడే చనిపోతున్నాయి. ఎండ వేడికి బయటికి వెళ్లకుండా అధిక శాతం నీరు తీసుకొని ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటే గనుక తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.

బయటకు వెళ్తే గనుక ఎక్కువ నీటిని సేవించాలని, మజ్జిగగానీ, నిమ్మరసంకానీ జ్యూస్‌లు కానీ సేవించి ఎండ నుండి ఎప్పటికప్పుడు ఉపశమనం పొందాలని తెలియజేస్తున్నారు. ఎండ వేడి తలకు నేరుగా తగలకుండా తలకు రుమాలు చుట్టుకోవడంగానీ లేదా గొడుగును వాడటంకానీ చేయాలని పేర్కొంటున్నారు. ప్రజలు ఎండవేడికి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావడంలేదు. శనివారం వరకు 44 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రత శనివారం నుంచి 45 దాటింది. శనివారం ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని నేరెళ్లలో 45.4, జమ్మికుంట మండలం గనుగులలో 45.3, ముస్తాబాద్, గంగాధర, ధర్మపురిలలో 45 దాటింది. ఎప్పుడు రామగుండంలో అత్యధికంగా నమోదయ్యే ఉష్ణోగ్రత చుట్టు ప్రాంతాలకూ పాకింది. ఏప్రిల్ 28న జగిత్యాల జిల్లా కోరుట్లలో 45.4, కరీంనగర్‌లో 45.3, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 45.2, పెద్దపల్లి 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది.

29వ తేదీన కరీంనగర్ 45.1, జగిత్యాల 45.4, పెద్దపల్లిలో 44.7, రాజన్న సిరిసిల్లలో 44.9 నమోదయ్యింది. ఏప్రిల్ 30న జగిత్యాలలో 44.8, రాజన్న సిరిసిల్లలో 44.7, ధర్మపురిలో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. బుధవారం రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్‌లో 45.5 డిగ్రీలు, పెద్దపల్లిలో 45 డిగ్రీలు, జగిత్యాలలో 45.4 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 45 డిగ్రీలు నమోదయ్యింది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. నాలుగు సంవత్సరాల క్రితం 2015 మే నెలలో జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌లలో గరిష్టం 48 దాటింది. ఈసారి కూడా మే చివరి వారం నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎండ తీవ్రత ప్రభావం అన్ని వర్గాలపై పడుతుంది. ఎన్నికల ప్రచారంపై కూడా ప్రభావం అధికంగానే ఉంది.

ఎండ తీవ్రత జెడ్పీటీసీ అభ్యర్థులు తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు ప్రచారం ముగించుకుంటున్నారు. పలువురు నేతలు ఎండ తాకిడికి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మే 6, 10, 14న మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చాలా చోట్ల ఎండ తాకిడిని తట్టుకోలేక వాట్సప్, మెసేజ్, ఫోన్‌కాల్స్‌తో ఓటును అభ్యర్థిస్తున్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండకు జనం తల్లడిల్లుతున్నారు. ఎండతాకిడి నుండి జనం తట్టుకునేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రయాణాల్లో ప్రజలు తప్పనిసరిగా మంచినీళ్ల బాటిళ్లతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ముందుముందు ఎండలు ఇంకా పెరిగే సూచనలు ఉండడంతో జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Temperature effect in Karimnagar Joint district

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అగ్ని గుండం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: