నేడు ప్రగతిభవన్‌లో తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

Ys Jagan

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరిగే ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించనున్నారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇటీవలే తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం వైఎస్ జగన్ గోదావరి తరలింపుపై చర్చలు జరపగా, అందుకు కొనసాగింపుగా రెండు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజినీర్ల బృందాలు సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలు రూపొందించాయి. ఇప్పుడు ఆ ప్రతిపాదనలపై సిఎంలిద్దరూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu states Cms Meet At Pragathi Bhavan Today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు ప్రగతిభవన్‌లో తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.