కెటిఆర్ చొరవతో.. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు…

KTR

 

హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చొరవతో సౌదీ నుంచి హైదరాబాద్ కు 39 మంది తెలంగాణ కార్మికులు చేరుకున్నారు. గతేడాది కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సౌదీలో నిర్మాణ రంగ సంస్థలో పని కోసం వెళ్లిన 60 మంది కార్మికలు గత ఆరు నెలలుగా ఎలాంటి వేతనాలు లేక ఇబ్బందులు పడ్డ కార్మికులు తమ సమస్యలు ట్విట్టర్ ద్వారా కెటిఆర్ కు తెలిపారు. దీనిపై స్పందిన కెటిఆర్ కార్మికుల సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ను కోరారు.

సౌదీలోని భారత రాయబార కార్యాలయ అధికారులను విజ్ఞప్తి మేరకు కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. భారత రాయబార కార్యాలయం కార్మికుల దగ్గర ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో తాత్కాలిక ఎగ్జిట్ వీసాలను ఇచ్చి, విమాన టికెట్లను సమకూర్చి తెలంగాణకు పంపించింది. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్టానికి చేరుకోవడం పట్ల కెటిఆర్ హర్షం వ్యక్తం చేస్తూ.. సౌదీలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో పాటు తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Telangana workers from Saudi reached Hyderabad

The post కెటిఆర్ చొరవతో.. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.