బిజెపిలో చేరిన తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలు

TDP and Congressఢిల్లీ : తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు గురువారం బిజెపిలో చేరారు. టిడిపి నేతలు ఇనగాల పెద్దిరెడ్డి, చాడా సురేష్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన శశిధర్ రెడ్డి, బోడ జనార్థన్ రెడ్డిలు బిజెపి అగ్రనేత మురళీధర్ రావు సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. వీరి చేరిక సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు బిజెపియే ప్రత్యామ్నాయంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు బిజెపిలో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ లో బిజెపిలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Telangana TDP and Congress leaders joining BJP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపిలో చేరిన తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.