టెన్త్ ఫలితాలు నేడే

  ఉదయం 11.30 గం.కు సచివాలయంలోని డి బ్లాక్‌లో విడుదల చేయనున్న విద్యాశాఖ కార్యదర్శి ఫలితాలను www.results.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డి బ్లాక్‌లో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.results.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుల సౌకర్యార్థం ఈ […] The post టెన్త్ ఫలితాలు నేడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉదయం 11.30 గం.కు సచివాలయంలోని డి బ్లాక్‌లో విడుదల చేయనున్న విద్యాశాఖ కార్యదర్శి
ఫలితాలను www.results.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు

మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డి బ్లాక్‌లో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.results.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుల సౌకర్యార్థం ఈ సారి హెడ్‌మాస్టర్ల లాగిన్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 27న ఫలితాలు వెల్లడి కాగా, ఈ సారి 15 రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు దొర్లిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాలను ముందు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని విడుదల చేయాలని నిర్ణయించారు.

ఫిర్యాదులకు ప్రత్యేక యాప్
పదవ తరగతి ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే ఫిర్యాదులు చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక యాప్ TSSSCBOARDను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు www.bse.telangana,gov.inలో లింక్‌ను అందుబాటులో ఉంచినట్లు సుధాకర్ తెలిపారు. అలాగే ప్లే స్టోర్ నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థుల హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి. విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత విద్యార్థి పేరు, పాఠశాల వివరాలు, హాల్‌టికెట్ నెంబర్ స్కీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి విద్యార్థులు తమది ఏ రకమైన ఫిర్యాదో ఎంపిక చేసుకుని, టెక్ట్ బాక్స్‌లో తమ ఫిర్యాదును నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. విద్యార్థులు తమ ఫిర్యాదును సబ్‌మిట్ చేసిన వెంటనే వారి మొబైల్ నెంబర్ ఒక ఫిర్యాదు అందినట్లు మెస్సేజ్ వస్తుంది. ఈ యాప్‌లో విద్యార్థులు ఒక సారి మాత్రమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.

Telangana SSC result will be released today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టెన్త్ ఫలితాలు నేడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: