ప్రశాంతంగా కానిస్టేబుల్ తుది రాత పరీక్ష

  ఆదిలాబాద్‌: స్థానిక పట్టణంలోని 18 కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఎలాంటి ఆటంకం లేకుండా ఆదివారం ప్రశాంతంగా పూర్తి చేశారు. జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియర్, సెలవులో ఉన్నందున నిర్మల్ జిల్లా ఎస్పి సి. శశిధర్ రాజు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఉదయం అభ్యర్థులకు గంట ముందే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఈ పరీక్షకు 5628 మంది అభ్యర్థులు హాజరు కాగా 61 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యరు. […] The post ప్రశాంతంగా కానిస్టేబుల్ తుది రాత పరీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్‌: స్థానిక పట్టణంలోని 18 కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఎలాంటి ఆటంకం లేకుండా ఆదివారం ప్రశాంతంగా పూర్తి చేశారు. జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియర్, సెలవులో ఉన్నందున నిర్మల్ జిల్లా ఎస్పి సి. శశిధర్ రాజు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఉదయం అభ్యర్థులకు గంట ముందే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఈ పరీక్షకు 5628 మంది అభ్యర్థులు హాజరు కాగా 61 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యరు. జిల్లా అదనపు ఎస్పి కంచ మోహన్, శిక్షణ కేంద్రం డిఎస్పి ఎల్‌సి నాయక్, ప్రతి కేంద్రానికి వెళ్లి పరీక్ష సరళిని సమీక్షించారు. ప్రతి కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలను సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఇంచార్జ్ ఎస్పి వెల్లడించారు.

పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు తాగ్రునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ… కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా తుది రాత పరీక్ష ప్రశాంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఉదయం నుండి పరీక్ష కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి సజావుగా సాగేందుకు తోడ్పడినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ జెఎన్టియు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారన్నట్టు తెలిపారు. స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్, జాకీర్ హుస్సేన్, సంబంధిత ప్రిన్సిపాల్, లెక్చరర్లు, సమర్థకంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

Telangana Police Constable final exam in Adilabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రశాంతంగా కానిస్టేబుల్ తుది రాత పరీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: