సొంతూరుకు కాలినడకన పయనం.. అందోల్ ఎంఎల్ఎ మానవత దృక్పదం

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వాహనాలు లేక నడుచుకుంటూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఇటీవల కాలినడకన నారాయణపేట జిల్లా కోస్గి, కర్నూలు జిల్లాకు వెళుతున్న కూలీలను ఆదుకున్నారు. ఈక్రమంలో చౌటకుర్ జాతీయ రహదారి ప్రక్కన కొందరు జనాలు వారిలో కొందరు చిన్న పిల్లలు నడుచుకుంటూ వెళ్లడం గమనించిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెంటనే స్పందించారు. పాదాచారులు తాము హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ పరిధిలోని గ్రామాలకు వెళ్తున్నట్లు ఎంఎల్‌ఎకు వివరించారు. తాము రెండు […] The post సొంతూరుకు కాలినడకన పయనం.. అందోల్ ఎంఎల్ఎ మానవత దృక్పదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వాహనాలు లేక నడుచుకుంటూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఇటీవల కాలినడకన నారాయణపేట జిల్లా కోస్గి, కర్నూలు జిల్లాకు వెళుతున్న కూలీలను ఆదుకున్నారు. ఈక్రమంలో చౌటకుర్ జాతీయ రహదారి ప్రక్కన కొందరు జనాలు వారిలో కొందరు చిన్న పిల్లలు నడుచుకుంటూ వెళ్లడం గమనించిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెంటనే స్పందించారు. పాదాచారులు తాము హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ పరిధిలోని గ్రామాలకు వెళ్తున్నట్లు ఎంఎల్‌ఎకు వివరించారు. తాము రెండు రోజులుగా రవాణా సౌకర్యం లేక నడకన వెళ్తున్నామని, ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో ఆహారం దొరకండం లేదని, చాలా ఇబ్బందిగా ఉందని వారి బాధను చెప్పగానే, ఆందోల్ ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్ స్పందించాడు. మానవత దృక్పదంతో వెంటనే వాళ్ళకు అవసరమైన వాహనాన్ని స్థానిక పోలీస్ ల సహకారంతో ఏర్పాటు చేశారు. అలాగే జోగిపేట్ లో వారికి భోజన ఏర్పాట్లు చేసి వారి స్వగ్రామాలకు పంపించారు. వాహనాలు లేక స్వగ్రామాలకు నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఆశ్రయం ఇవ్వడం వాళ్ళ దాహం తీర్చండి అవసరమైతే బువ్వ కూడా పెట్టండని ఎంఎల్‌ఎ పిలుపునిచ్చారు. రహదారి మీదున్న గ్రామాలలోని సర్పంచులు, టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పాదాచారులను ఆదుకోవాలని సూచించారు.

Telangana Lockdown due to Corona 

The post సొంతూరుకు కాలినడకన పయనం.. అందోల్ ఎంఎల్ఎ మానవత దృక్పదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: