పాతనగరంలో సాహితీ సభలు

  ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి హైదరాబాద్ పాతనగర రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వార్షిక సాహిత్య సదస్సులు వెంకటరావు స్మారకోన్నత పాఠశాల లాల్‌దర్వాజాలో ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలలో వివిధ సాహిత్య ప్రక్రియలపై ప్రసిద్ధ విమర్శకులు ప్రసంగించారు. ఈ వార్షిక వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి విచ్చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు తెలుగు ఉర్దూ భాషలు సహజీవనం చేశాయని వాటి ఉనికి క్రమంగా […]

 

ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి హైదరాబాద్ పాతనగర రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వార్షిక సాహిత్య సదస్సులు వెంకటరావు స్మారకోన్నత పాఠశాల లాల్‌దర్వాజాలో ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలలో వివిధ సాహిత్య ప్రక్రియలపై ప్రసిద్ధ విమర్శకులు ప్రసంగించారు. ఈ వార్షిక వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి విచ్చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు తెలుగు ఉర్దూ భాషలు సహజీవనం చేశాయని వాటి ఉనికి క్రమంగా తగ్గుతుందన్నారు. వీటిని పరిరక్షించటానికి ప్రతిఒక్కరూ కృషిచేసి, కాపాడుకోవాలన్నారు. అనాదిగా మనదైన సంస్కృతీసంప్రదాయాలు, భాషలను మనమే రక్షించుకోవాలన్నారు. ఈ ప్రారంభ సమావేశానికి ప్రముఖ రచయిత చింతపట్ల సుదర్శన్ అధ్యక్షత వహించారు. సీనియర్ రచయిత ఆర్వీ రామారావు ‘పాతనగరం భాషా సాహిత్యం సంస్కృతి’ అనే అంశంపై అలాగే, డాక్టర్ నాళేశ్వరం శంకరం ‘హైదరాబాద్ నగర పాతనగర సాహిత్య సంస్థలు’ అనే అంశంపై ప్రసంగించారు. తదుపరి ప్రముఖ కవి రేడియం ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇందులో బండి ఉషా శ్రీను, మధుకుమారి, కె.కె.వెంకటశర్మ, వి.ఫణిశేఖరశర్మలు కవితా పఠనం చేశారు.

కె.హరనాథ్ వందన సమర్పణతో మొదటి సమావేశం ముగిసింది. తదుపరి గొట్టిపర్తి యాదగిరిరావు అధ్యక్షతన “పాతనగర ఉర్దూ కవిత్వం’పై మహమ్మద్ సైఫుల్లా ఎంతో విఫులంగా ఉర్దూ కవిత్వంపై మాట్లాడుతూ, ఎందరో ఉర్దూ కవులు పాతనగరంలో తమ కవిత్వాన్ని వివిధ పత్రికలు, మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నారని కొనియాడారు. ఉర్దూ కవిత్వంలో ఉన్న మాధుర్యం మరే భాషలోనూ లేదని చెప్పారు. అనంతరం “తెలంగాణ కవిత్వం’ విమర్శ ’అనే అంశంపై కొండపల్లి నీహారిణి ఉపన్యాసం చేశారు. ఆ వెంటనే కవితా పఠనం కూడా సాగింది. ఇందులో ఎనిసెట్టి శంకర్, లక్ష్మీ తుర్లపాటి, మావి శ్రీ, డా॥ పల్లేరు వీరస్వామి, డా॥ఎస్. విజయభాస్కర్, శ్రీవాణి, శ్రీనాథ్‌ల కవితా పఠనంతో ఈ రెండవ సమావేశం ఘనంగా ముగిసింది.

రెండవ రోజు జరిగిన మూడవ సమావేశానికి ప్రముఖ కవి రచయిత, ఆకాశవాణి ప్రయోక్త సిఎస్.రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతనగరంలో సాహిత్య సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించటం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సమావేశానికి ప్రముఖ కవి కె.హరనాధ్ సభాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ విమర్శకులు కె.పి.అశోక్‌కుమార్ తెలంగాణ కథపై, కాసుల ప్రతాపరెడ్డి ‘తెలంగాణ నవలపై సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.

మొదటిగా కె.పి. అశోక్‌కుమార్‌గా తెలంగాణ కథపై ప్రసంగిస్తూ…
తెలంగాణ కథ మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డిలతో మొదలైందన్నారు. నందిగిరి ఇందిరాదేవి తొలినాటి రచయిత్రిగా మొదటి రేడియో ప్రసంగకర్త గా చెప్పారు. అప్పటి డెక్కన్ రేడియోతో తెలంగాణ కథలను మూడు రకాలుగా విభజిస్తే, తెలంగాణ పోరాట పూర్వ కథలు, నిజాం కాలం నాటి పరిస్థితులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో వచ్చిన కథలు 1970 తర్వాత పెండ్యాల సర్వదేవరభట్ల నరసింహమూర్తి వంటి వారు రాజకీయ పోరాట సందర్భంగా కథలను సృజించారు. ‘బదలా “న్యూవేవ్’, సంకలనాలు సృజనకారుల ఆలోచనల్లో మార్పులు తెచ్చాయి. అల్లం రాజయ్య వంటి వారు ప్రధాన భూమిక పోషించారు. 1990 తర్వాత తెలంగాణ కథ, గ్లోబలైజేషన్, తెలంగాణ ఉద్యమ బాట పట్టింది. పాతనగర రచయితలు నందగిరి వెంకట్రావ్ వంటి వారు గొప్ప కథలు రాశారు ” అని కె.పి. సుదీర్ఘ ఉపన్యాసం అందించారు.

తెలంగాణ నవల గురించి కాసుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ “పాతబస్తీకి చెందిన రచయితలను , కవులను కలుపుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. 199698 కాలంలో తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికున్న అస్తిత్వాన్ని వెతికే ప్రయత్నం చేశాం. తెలంగాణ సాహిత్యం ఎందుకు విస్మృతిగా మారిందో విశ్లేషించాల్సి వచ్చింది. సాంస్కృతిక వైరుధ్యాలు, అసమానతలు, వెనుకబాటుతనం తెలంగాణలో ఉండటం ఆంధ్ర ప్రాంతంలో ఇంగ్లీష్ భాషతో విద్య విస్తరించటం తరువాత అక్కడ వ్యవసాయ ం వృద్ధి చెందటంతో సినిమా పత్రికారంగంలో పెరిగిన వారి పాత్ర తెలంగాణ సంస్కృతిని కలపుకోలేకపోయారు. భావ సమైక్యత కుదరలేదు. రెండు తెలుగు సమాజాల మధ్య వైరుధ్యాలు సాహిత్యాన్ని వెతుక్కునేలా చేసింది. అలా తెలంగాణ నవల కూడా వివక్షతకు గురైంది” అంటూ ప్రసంగించారు.

ఈ సభకు కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత పి.బ్రహ్మనందచారి ఆత్మీయ అతిథిగా వెంకట్రావ్ స్మారకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు రేణు, విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. తదుపరి డా॥ ఎస్.సూర్యప్రకాశ్ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. అందులో చివుకుల ఉషారాణి, దేవులపల్లి సునంద, డా॥భీంపల్లి శ్రీకాంత్, కె.రాధాకృష్ణారావు, బి.వెంకటేశ్వర్లు తదితర కవులు పాల్గొన్నారు.

అదేరోజు మధ్యాహ్నం సమాపక సమావేశానికి ఆంధ్ర సారస్వత పరిషత్ విశ్రాంత రీడర్ డా॥కె.వి. సుందరాచార్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, పాతనగర రచయితల సాహిత్యం గురించి విపులంగా వివరించారు. ఆత్మీయ అతిథిగా డి.సోమనాథరావు సందేశం వినిపించారు. ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ రచయిత పాత్రికేయులు ఆర్వీ రామారావు ఉన్నారు. అనంతరం చింతపట్ల సుదర్శన్ పాతనగర సాహితీ స్రవంతి , అలాగే ఎం.ఎ. సత్యనారాయణరావు, పాతనగరం సాహిత్యం కవులు అనే అంశాలపై ప్రసంగించారు. అనంతరం ప్రముఖ కవి కన్నోజు లక్ష్మీకాంతం అధ్యక్షతన కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో, రజని కులకర్ణి, కందు కూరి శ్రీరాములు, కె.హరనాథ్, గొట్టిపర్తి యాదగిరిరావు, డా॥ విష్ణువర్దన్ లు కవితా పఠనం చేశారు. అందరినీ మొ మెంటోలతో, శాలువాలతో సత్కరిం చా రు. కన్నోజు లక్ష్మీకాంతం వందన సమ ర్పణతో సభలు ముగిశాయి. ఇలా పాత నగరంలో రెం డు రోజులు ఘనంగా వార్షిక సాహిత్యసదస్సులు ముగిశాయి.

                                                                                                                    – కె.హరనాథ్

Telangana literature houses in old city of Hyderabad

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]