అక్టోబర్ 4న పంచాయతీ కార్యదర్శుల పరీక్ష

తేదీ మార్పుతో ఈనెల 15 వరకు దరఖాస్తుల గడువు పొడిగింపు మన తెలంగాణ/ హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 28న జరగాల్సిన రాతపరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది.  సోమవారం (సెప్టెంబర్ 11వ తేదీ)తో ఫీజు చెల్లిం పు గడువు ముగియనుండగా, దానిని ఈ […]

తేదీ మార్పుతో ఈనెల 15 వరకు దరఖాస్తుల గడువు పొడిగింపు

మన తెలంగాణ/ హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 28న జరగాల్సిన రాతపరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది.  సోమవారం (సెప్టెంబర్ 11వ తేదీ)తో ఫీజు చెల్లిం పు గడువు ముగియనుండగా, దానిని ఈ నెల 14 వరకు పొడిగించారు. అలాగే మంగళవారం ముగియాల్సిన దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తూ నియామక కమిటీ కన్వీనర్ నీతూప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు చేయడంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలై అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. అపద్దర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన మేరకు అధికారులు దరఖాస్తు గడువును పొడిగించారు.

Related Stories: