తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు భేష్

నర్సులు, ఆశావర్కర్లకు ఇన్సూరెన్స్‌లు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతం గా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన గురువారం రాష్ట్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వైద్య మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా నివారణ కోసం ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే […] The post తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నర్సులు, ఆశావర్కర్లకు ఇన్సూరెన్స్‌లు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతం గా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన గురువారం రాష్ట్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వైద్య మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా నివారణ కోసం ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే వారిని కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచాలని, అదే విధంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిని కూడా బయటకు రాకుండా చూడాలని సూచించారు. కరోనా చికిత్సలు అందిస్తున్న నర్సులు, ఆశావర్కర్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు ప్రకటించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈట ల పాల్గొని, పలు అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. కోవిడ్ చికిత్సకు వినియోగించే పరికరాల తయారీకి హైదరాబాద్‌లోని డిఆర్‌డిఓ, బిడిఎల్, ఈసిఐయల్ సంస్థలకు అనుమతి ఇవ్వాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశా రు. దీంతో పాటు ఎన్ 95 మాస్కులు, పిపిపి కిట్లు, వెంటిలేటర్స్ అందించాలన్నారు. వైరస్ నియంత్రణకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని ఈటల తెలిపారు.

telangana is taking good measures to prevent corona

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: