దేశానికే తెలంగాణ ఆదర్శం: హరీశ్‌రావు

ఆగస్టు నుండి రైతు బీమా కాళేశ్వరం కాలువతో నర్సాపూర్ నియోజక వర్గానికి 70 వేల ఎకరాలకు నీరు త్వరలోనే నియోజక వర్గానికో బిసి గురుకులం అభివృద్ధ్దికి కాంగ్రెస్ అడ్డుపడుతోంది : హరీశ్‌రావు మెదక్/శివ్వంపేట: అభివృద్ధి పనులలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దొంతి, బిజ్లీపూర్, గోమారం, చిన్నగొట్టిముకుల, తిమ్మపూర్, శివ్వంపేట, ఏదుల్లాపూర్ గ్రామాలలో, ఎంపి కొత్త ప్రభకర్‌రెడ్డి,ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలతో కలిసి […]

ఆగస్టు నుండి రైతు బీమా
కాళేశ్వరం కాలువతో నర్సాపూర్ నియోజక వర్గానికి 70 వేల ఎకరాలకు నీరు
త్వరలోనే నియోజక వర్గానికో బిసి గురుకులం
అభివృద్ధ్దికి కాంగ్రెస్ అడ్డుపడుతోంది : హరీశ్‌రావు

మెదక్/శివ్వంపేట: అభివృద్ధి పనులలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దొంతి, బిజ్లీపూర్, గోమారం, చిన్నగొట్టిముకుల, తిమ్మపూర్, శివ్వంపేట, ఏదుల్లాపూర్ గ్రామాలలో, ఎంపి కొత్త ప్రభకర్‌రెడ్డి,ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మండల సరిధిలోని ఏదుల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కాళేశ్వరం కాలువ నీటితో ప్రతి గ్రాంలోని పంట పొలానికీ నీరు ఇవ్వాలన్న ఆలోచనతో,అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు ఇవ్వాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం ఎంతో గొప్పదన్నారు. పంట పండించే ప్రతి రైతుకు మేలు చేయాలన్న సంకల్పంతో రుణమాఫీ, రైతుబంధు పథకాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం , ఆగస్టు 15 నుండి రైతు బీమాతో రైతుకు మంరింత మేలు చేకూర్చాలని ఆలోచించడం గొప్ప విషయమన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మెరుగైన చికిత్స అందిస్తూ,తల్లి పిల్ల సంరక్షణ కోసం కెసిఆర్ కిట్ తోపాటు ప్రోత్సాహకంగా రూ.13 వేలు అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

Comments

comments

Related Stories: