మాతృత్వపు మరణాలు తగ్గుముఖం

Maternal Mortality

 

దేశవ్యాప్తంగా తెలంగాణలో ఐదో స్థానం
కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వపు మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మాతా మరణాలు 2015, 20-17 నివేదికను తాజాగా శుక్రవారం నాడు విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో బాలింతల మరణా లు తగ్గాయి. మరణాల తగ్గుదలలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. జాతీయస్థాయిలో అత్యంత తక్కువగా కేరళలో ప్రతి లక్ష మందిలో 42మంది, మహా రాష్ట్రలో 55, తమిళనాడులో 63 మంది, ఆం ధ్రప్రదేశ్లో 74, తెలంగాణ, జార్ఖండ్లలో 76 మంది చొప్పున బాలింతలు మరణిస్తున్నా రు. 2014-16 మధ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ లక్ష మందిలో 81 మంది బాలింతలు మరణించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 76కు తగ్గింది. జాతీయ స్థాయిలో మాతా మరణాల రేటు 122 ఉండగా, దేశంలో అత్యధికంగా మాతృత్వపు మరణాల రేటు అస్సాంలో 229 ఉండ టం ఆందోళన కలిగిస్తుంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్రాష్ట్రంలో మరణాల రేటు 216 ఉంది.

మూడు దశల్లో
మాతా మరణాలను మూడు దశల్లో లెక్కిస్తారు. 15 నుంచి 49 ఏళ్లలోపు గర్భిణీలను లెక్కలోకి తీసుకుంటారు. గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య రక్షణ లేకపోవడం వల్ల సంభవించే మరణాలు, ప్రసవ సమయంలో సంభవించే మరణాలు, ఆ తర్వాత నెల లోపులో జరిగే మరణాలను మాతా మరణాలుగా పరిగణిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మాతా మరణాలను ప్రతీ లక్షకు ఎంతమంది బాలింతలు చనిపోయారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం దేశంలో మాతృత్వపు మరణాల రేటు దక్షిణ భారతదేశంలోనే గణనీయంగా తగ్గడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే అత్యధికంగా 97 మరణాలు సంభవిస్తున్నాయి. జార్ఖండ్లోనైతే 2014-16 మధ్య మాతా మరణాల రేటు 165 ఉంటే, ఈసారి ఏకంగా 76కు తగ్గడం విశేషం. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే గతానికంటే సగానికిపైగా తగ్గాయి. విచిత్రమేంటంటే మధ్యప్రదేశ్లో గతంలో మాతృత్వపు మరణాల రేటు 173 ఉంటే, ఈసారి మరీ దారుణంగా మరణాల రేటు 188కు పెరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్లో గతంలో మరణాల రేటు 201 ఉంటే, ఈసారి అదికాస్తా 216కు పెరిగింది.

ప్రసవ కేంద్రాల బలోపేతమే కారణం…
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ కేంద్రాలను (లేబర్రూమ్స్) బలోపేతం చేయడం వల్లే మాతృత్వపు మరణాలు తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ప్రసవ కేంద్రాలపై దృష్టిసారించిందని, వాటిల్లో మౌలికసదుపాయాలు కల్పించిందని చెబుతున్నారు. కేసీఆర్కిట్ప్రారంభానికి ముందే చేపట్టిన ఇటువంటి సౌకర్యాలతో మరణాల రేటు తగ్గిందని అంటున్నారు. అంతేగాక దాదాపు 300 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను 24 గంటల ఆసుపత్రులుగా మార్చడం వల్ల కూడా మాతృత్వపు మరణాలు తగ్గడానికి కారణమని తెలిపారు.

Telangana is fifth rank in Maternal Mortality reduction

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాతృత్వపు మరణాలు తగ్గుముఖం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.