టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ కు బెయిల్

హైదరాబాద్‌: టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మూడు కేసుల్లో రవిప్రకాశ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.  ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో రవిప్రకాశ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు సహకరించాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి  పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు […] The post టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ కు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మూడు కేసుల్లో రవిప్రకాశ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.  ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో రవిప్రకాశ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు సహకరించాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి  పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు రవి ప్రకాశ్ కు సూచించింది. హైకోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది.

 

Telangana High Court Give Bail to TV9 Ravi Prakash

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ కు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: