ఎంఎల్‌సిలపై అనర్హత వేటు సబబే

మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్సీ సభ్యత్వంపై శాసనమండలి అనర్హత వేటుకు సంబంధించిన రాములు నాయక్, యాదవరెడ్డిలకు బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. శాసనమండలి చైర్మన్ గతంలో తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. తమపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాములు నాయక్, యాదవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి […] The post ఎంఎల్‌సిలపై అనర్హత వేటు సబబే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్సీ సభ్యత్వంపై శాసనమండలి అనర్హత వేటుకు సంబంధించిన రాములు నాయక్, యాదవరెడ్డిలకు బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. శాసనమండలి చైర్మన్ గతంలో తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. తమపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాములు నాయక్, యాదవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు తమ స్థానాల్లో ఎన్నికలు ఆపాలన్న పిటిషనర్ల అభ్యర్థనను పరిశీలించాలని హైకోర్టు ఇసికి సూచించింది. తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరినందున యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తెరాస శాసనమండలి పక్షం కోరిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అప్పటి మండలి వీరిపై అనర్హత వేటు వేసింది. శాసనమండలి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు అనంతరం బుధవారం ఇద్దరికి సంబంధించిన తీర్పు వెలువరించింది.

Telangana High Court backs Ramulu Naik disqualification

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎంఎల్‌సిలపై అనర్హత వేటు సబబే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.