పంటోనికి తెలుస్తది గూనొంపు..

Crops Harvesting

 

తెలంగాణ రైతాంగానికి రొండు పంటలకు నీల్లివ్వాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అందుకోసం మార్వాడి లెక్కలు కాకుండా మనసుతో లెక్కలు వేసిండు. గణితంలో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అని వుంటయి. వాటి ప్రకారం… వొక వేల ఇదిట్లయితే అదెట్ల.. అదట్లయితే ఇదెట్ల..? అని అటు ఇటు ఆలోచించి… చెస్ గేమ్‌లో మాదిరి ఏ ఎత్తు ఎక్కడ వేస్తే తెలంగాణ రైతుకు ఆటంకం లేకుండా అన్నిదారుల్లో నీల్లివ్వగలం… అని సాధ్యాసాధ్యాలను పరిశీలించి, కొన్ని నెలల పాటు చర్చలు జరిపి, నిపుణుల సలహాలు సంప్రదింపుల తర్వాత.. సిఎం కెసిఆర్ మెదడును రంగరించి తీసుకున్న నిర్ణయం కాళేశ్వర ప్రాజెక్టు. వొడ్డు మీద కూసోని రాల్లేసినంత ఆశామాషిగా కాలేదు..కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం. మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైంది ఎల్లంపెల్లి ప్రాజెక్టు.

పంటోనికే తెలుస్తది గూ నొంపు.. వుత్తగున్నోనికేం తెలస్తది,,’ మొన్నటి ధర్మపురి విలేకరుల సమావేశంలో సిఎం కెసిఆర్ అన్న సామెతలోని సారాంశం.. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డగోలుగ విమర్శిస్తున్న కొందరికి ఇప్పటికే అర్థమై వుండాలె. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకుంటున్న కష్టాలు ఎన్నితీర్ల తిప్పలబడుతాంటే ఫలితం వచ్చిందో క్షేత్రస్థాయి అనుభవరాహిత్యంతో మాట్లాడే అప్రకటిత మేధావులకు సిఎం కెసిఆర్ మాటలు అర్థం అయ్యే వుండాలె. తల్లి గర్భంలో అంకురం జరిగిన నాటి నుంచి తొమ్మిది నెల్ల పాటు వొక్కొక్క అవయవాన్ని సంతరించుకుంటూ నవజాత శిశువు ఎట్లయితే ప్రాణం పోసుకుంటదో.. సేమ్ టు సేమ్ కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా అటువంటి సున్నితమైన ఘట్టాలను దాటుకుంటూనే సంపూర్ణతను సంతరించుకుంటోంది. కాళేశ్వర ముక్తీశ్వర ప్రాజెక్టుల నిర్మా ణం అంటే… తెలంగాణ యవుసాన్ని రైతును బతికిద్దానికి ముఖ్యమంత్రి చేస్తున్న సృస్టికి ప్రతిసృష్టి.

ప్రకృతి కుట్ర పన్ని సహకరించింది
ఎప్పుడూ జూన్ మొదటి వారంలోనే లక్షల క్యూసెక్కులతో సముద్రుని వైపు పరుగులు పెట్టే ప్రాణహిత ఈ సారి ఎందుకో ఆలస్యమైంది. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఆగి, ఆ తెల్లారినించి ప్రాణహిత వరద మొదలయ్యింది. రోజుకింత జమయ్యి కొత్త ప్రాజెక్టును నిమ్మలంగా జాగ్రత్తగా నింపింది. లీకేజీలు తదితర సాంకేతిక అంశాలను చెక్ చేసుకుంటూ ఎట్లయితే ఇంజనీర్లు నీల్లు వొదిలేవారో… సరిగ్గా అట్లనే ఇక్కడ ప్రకృతి వో ఇంజినీరుగా పని చేసింది. ఐదు వేల క్యూసెక్కుల నుంచి కొద్దిల కొద్దిల పదేవేలు ఇరువై వేలు అట్లా పది రోజుల్లోపు వచ్చిన వరద.. ఇక ఢోకా లేదు అనుకుందో ఏమో.. అప్పుడు లక్ష రొండు లక్షలు నాలుగైదు లక్షలకు పెరిగింది ప్రాణహిత ప్రవా హం.

నీల్లు జమైతాన కొద్దీ వొక్కొక్క మోటర్ ను నడిపించుకుంటూ అన్నితీర్ల టెస్టులు పెట్టుకుంటూ కన్నెపెల్లి, అన్నారం, సుందిల్లలో ఎత్తిపోతలకు ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద పంపులు ప్రాణహిత జలాలను ఎత్తిపోసే పరీక్షల్లో విజయవంతంగా ఫస్టుక్లాసులో పాసయినయి. గోదావరి వడిలో ప్రాణహిత జలాలు ఎదురెక్కే చారిత్రక ఘట్టాన్ని సాక్షాత్కరించినయి. అట్లా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మెదడును కరిగించి అందించిన ఇంజినీరింగు తాత్వికతకు అనుగుణంగానే గోదారమ్మ పాజిటివ్‌గా స్పందించి ప్రాణహిత జలాలను తనలో ఇముడ్చుకున్నది. తదనుగుణంగా ప్రక్రుతిమాత సహకరించింది. సంకల్ప బలం దృఢంగా వున్న కార్యసాధకుని విజయానికి ప్రకృతి కూడా కుట్ర పూరితంగా సహకరిస్తదని.. పాలోకోయిల అనే ప్రముఖ రచయిత అంటడు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తికావడంలో కెసిఆర్ సంకల్పానికి ప్రకృతి కూడా అట్ల కుట్ర పన్నినట్టే సహకరించింది.

ఉద్యమ నినాదాన్ని నిజం చేసిన సిఎం
ఎండిన గోదావరిని కన్నుల పండుగ చేసే క్రమంలో ఎదురెక్కే జలాల స్వభావాన్ని, రిసీవ్ చేసుకునే నది స్వభావాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అంచనా వేసుకుంటూ మేడిగడ్డ నుంచి ఎల్లంపెల్లి దాకా అడుగడుగూ చెక్ చేసుకుంటూ, కాళేశ్వరం ఇంజినీర్లు ప్రాణహిత జలాలను వినియోగంలకు తెచ్చిన్రు. ఇన్ని తీర్ల దశలను దాటుకుంటూ సాగే.. ఇటువంటి ప్రపంచంలోనే అరుదైన నదీ ప్రవాహం, సాగునీటి కోసం నదులను ఎత్తిపోసే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మనసుపెట్టి అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు.

కానీ… త్యాగాల పునాదుల మీద సాధించిన తెలంగాణలో రైతులను బతికించడానికి మా నీల్లు మాగ్గావాలె.. అనే ఉద్యమ నినాదాన్ని నిజం చేస్తూ.. దండుగ అన్న తెలంగాణ యవుసాన్ని కన్నుల పండుగ చేసే కాళేశ్వర ప్రాజెక్టుల ప్రక్రియ వొక్కొక్కటి అమలులోకి వస్తున్నప్పుడు.. నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల తనువులు పులకించిపోతంటే కొందరికి మాత్రం వణుకు పుడుతున్నది. ఎత్తిపోతలు కావు ఇవి తప్పి పోతలు.. అనుకుంటూ కరెంటు బిల్లులమోత అనుకుంటూ.. వొకాయిన అంత్య ప్రాసల తీకనాలు తీస్తుంటే.. ఎల్లంపెల్లి నీల్లు ఎల్లిపోవాల్సిందేనా.. అంటూ.. కడుపుల నీల్ల బదులు గ్యాస్ నింపుకున్న కొందరు, కొన్ని పత్రికలు గ్యాసెల్ల దీసుకుంటున్నయి.

కాళేశ్వరం కొసా మూతితెల్వని ఇంక కొందరైతే… ప్యాకేజీ 6, 7, 8 లను త్వరితగతిన పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్యం వహిస్తున్నదని.. దుర్మార్గపు ఆరోపణలకు దిగిన్రు. ఎక్కడ సందు దొరుకుద్దా ప్రభుత్వాన్ని బదునాం చేద్దామా అనే అక్కసు తప్ప… అట్లా నిజాల మీద నీల్లు జల్లి అవగాహనా రాహిత్యంతో విమర్శించడం వల్ల.. సైనికుల్లాగా పనిచేస్తున్న కాళేశ్వరం ఇంజినీర్ల ఆత్మస్థైర్యాన్నీ దెబ్బ తీసినట్టయిద్దనిగానీ, ఇటు అహోరాత్రులు నిద్రాగారాలు మాని కాళేశ్వరం ప్రాజెక్టును చివరి దశకు తీసుకు వస్తున్న ప్రభుత్వం యంత్రాంగం సిఎం కెసిఆర్ చిత్తశుద్ధిని శంకించినట్టుగా అయిద్దని గానీ …ఈ కువిమర్శకులు ఆలోచించకపోవడం దురద్రుష్టకరం.

కువిమర్శలకు కనువిప్పుకావాలె
“పైనున్న కడెం ప్రాజెక్టు వరదతోనే ఎల్లంపెల్లి నిండిపోతున్నది.. మరి మేడిగడ్డ నుంచి ఇన్నాల్లూ పంపుల తోటి ఎల్లంపెల్లి దాకా పైకెత్తిపోసిన నీల్లన్నీ వృథాగా తిరిగి కిందకి పోతయిగదా…. అన్ని పంపులు నడుసుడు అంత కరెంటు కాలుడు అంతా వేస్టేగదా..”.. అనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నరు. వారికి సమాధానం ఏందంటే..తెలంగాణ రైతాంగానికి రొండు పంటలకు నీల్లివ్వాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అందుకోసం మార్వాడి లెక్కలు కాకుండా మనసుతో లెక్కలు వేసిండు. గణితంలో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అని వుంటయి. వాటి ప్రకారం… వొక వేల ఇదిట్లయితే అదెట్ల.. అదట్లయితే ఇదెట్ల..? అని అటు ఇటు ఆలోచించి… చెస్ గేమ్‌లో మాదిరి ఏ ఎత్తు ఎక్కడ వేస్తే తెలంగాణ రైతుకు ఆటంకం లేకుండా అన్నిదారుల్లో నీల్లివ్వగలం… అని సాధ్యాసాధ్యాలను పరిశీలించి, కొన్ని నెలల పాటు చర్చలు జరిపి, నిపుణుల సలహాలు సంప్రదింపుల తర్వాత.. సిఎం కెసిఆర్ మెదడును రంగరించి తీసుకున్న నిర్ణయం కాళేశ్వర ప్రాజెక్టు. వొడ్డు మీద కూసోని రాల్లేసినంత ఆశామాషిగా కాలేదు..కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం.

కడెం వరద మీద ఆధారపడలేం
మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైంది ఎల్లంపెల్లి ప్రాజెక్టు. ఇది నీల్ల జంక్షన్. మేడిగడ్డ నుంచి పైకి వచ్చిన ప్రాణహిత నీల్లుకానీ, వొకవేళ వస్తే ఎస్సారెస్పీని దాటుకొని వచ్చిన గోదావరి వరద కానీ, ఆకరికి కడెం వరద కానీ ఎల్లంపెల్లి ప్రాజెక్టుకు చేరనుకున్న తర్వాతే తెలంగాణ సాగుభూముల దిశగా పంపిణీ అయితయి. ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న ఎల్లంపెల్లి నిర్మాణం, టిఆరెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తయింది. కాగా ఎల్లంపెల్లికి వచ్చే కడెం వరద సగటున ఆగస్టు మాసంలో ఉండగా… ప్రాణహిత జూన్‌లోనే వుంటుంది. ఖరీఫ్ సాగు చేసుకునే రైతాంగానికి ఆగస్టు మాసంలో వచ్చే కడెం వరద ఆలస్యమైతది. అందుకోసమని… జూన్ ప్రారంభంలోనే వరద వచ్చే ప్రాణహిత జలాలను ఎప్పటికప్పుడు వడిసిపట్టి ఎత్తిపోసుకోవడం ద్వారా అటు మిడ్ మానేరుకు ఇటు ఎస్సారెస్పీకి చేరవేయడం ద్వారా ఖరీఫ్ మొదటి పాదంలోనే రైతాంగానికి నీరందించుకోవచ్చు.

ఈలోపు ఆగస్టులో వచ్చే కడెం వరద ఎల్లంపెల్లికి ఆసరా అయితది. అప్పుడు ఈ పంపులను నడుసుడుండదు కరెంటు కాలుడుండదు. ఎల్లంపెల్లి ప్రాజెక్టు స్టోరేజీ (148 ఎఫ్‌ఆర్‌ఎల్) 20.175 టిఎంసిలు. ఈ ప్రాజెక్టు కింద 75 టిఎంసిల నికర నదీ జలాల వినియోగానికి కేటాయింపులున్నయి. వాటిల్లో 37 టిఎంసిలు సాగునీటికి, 14 టిఎంసిలు ఎన్‌టిపిసి తదితర సంస్థల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి, మరో 17 టిఎంసిలు హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, మంచిర్యాల తదితర పట్టణాలకు తాగు నీటికి, మిషన్ భగీరథ పథకాలకు, మంథని గూడెం చిన్న చిన్న ఎత్తిపోతలకు, నీటి కేటాయింపులున్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుల ప్రారంభ సంవత్సరం కావడం వలన కొన్ని బాలారిష్టాలు మరికొన్ని సాంకేతిక సమస్యలు, కాలం ఎనకాముందు కావడం తదితర అంశాల వలన కొందరు విమర్శకులకు క్లారిటీ రాకపోవచ్చుగానీ.., వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కడెం వుండంగ గూడా ఎల్లంపెల్లికి కాళేశ్వర ప్రాజెక్టుల ప్రాధాన్యత ఏందో మరింత స్పష్టత వస్తది.

ఇంకో విమర్శ… ప్యాకేజీ 7 నిర్మాణం ముందుగాలెనే చేసుంటే ఇప్పటికే నీల్లన్ని ఎత్తుకుందుముగా… అనే అవగాహనలేని విమర్శకు సమాధానం ఏందంటే.. అత్యంత సంక్లిష్ట పనులను దాటుకుని నాలుగు రోజుల కిందటినుంచి నీటితో నిండుతున్న ప్యాకేజీ 7 సొరంగాల నిర్మా ణం ఇన్నాల్లూ ఆలస్యం కావడానికి బాధ్యులెవరు?

సమాధానం
ప్యాకేజీ 7 పనుల ఆలస్యానికి కారణం, గత ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టమైతున్నది. ఎందుకంటే ఈ పనులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై పడకేసినయి. ఈ సొరంగాల పనులు నత్తనడక సాగడమేకాదు.. అనేక సాంకేతిక సమస్యల నడుమ చిక్కుకుపోయినయి. ప్యాకేజ్ 7 జంట సొరంగాలు తొవ్వుతుంటే.. మల్లా పూర్ సమీపంలో లూజ్ సాయిల్ వచ్చి కుంగిపోయినాయి. భూమి సొరంగంలోకి కూలిపోగా.. సొరంగ మార్గాల్లో గ్రావిటీ ఏర్పడి వోపెన్ టు స్కై అయింది. అట్లా 8 జనవరి 2013 నాడు, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, సొరంగానికి పడ్డ పొక్కలను పూడ్చే ఆలోచనే లేకుండ పండపెట్టిన్రు పనులను.

అటువంటి సందర్భంలో.. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక.. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కశ్మీర్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన సీనియర్ ఇంజనీర్లను పిలిపించింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం. సొరంగ మార్గం కూలిపోవడానికి కారణమైన లూజ్ సాయిల్‌ను, సీపేజీని తొలగించి డివాటరింగ్ చేసి రిగ్గులతో మట్టిని తొలగించి స్టీల్ లైనర్లతో రి ఇన్ ఫోర్స్ కాంక్రీట్ తోని ఆ రంధ్రాలను సమర్ధవంతంగా పూడ్చిన్రు. ఆలస్యమైంది అని విమర్శించేటోలోలకు గానీ పత్రికలకు గానీ.. ఈ విషయం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారికి ముందే చెప్పుకున్నట్టు కాళేశ్వరం కాన్సెప్టును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికీ చేస్తనే చేస్తలేరు.

వాస్తవానికి ఎల్లంపెల్లి నుంచి నందిమేడారం వరకు 9.534 కిలోమీటర్ల మేర జంట సొరంగాల పని ప్యాకేజీ 6 పని ఎప్పుడో పూర్తయ్యింది. ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్ దగ్గరి అప్రోచ్ కనాల్ నుంచి నందిమేడారం సర్జిపూల్ దాకా ప్రాణహిత జలాలు ఈ జంట సొరంగాల నిండా నిండే వున్నయి. అక్కడి పంపులు కూడా వెట్ రన్ పూర్తి చేసుకున్నయి. నందిమేడారం రిజర్వాయర్లోకి జలాలను ఎగజిమ్మిన ఫస్టు కాళేశ్వరం పంపులు మనం విడియోల ల్లో మొదట చూసిన పంపులు ఇవే. ఇక ప్యాకేజీ 7. ఇది నందిమేడారం నుంచి నీల్లను లక్షీపూర్ దాకా తీసుకపోయే సొరంగమార్గం. 11.24 కిలో మీటర్లమేర భూ గర్భంలో గరిష్ఠంగా 140 మీటర్లలోతునించి నిర్మితమవుతున్న జంట సొరంగాలు గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ప్యాకేజీ 7 పనులు పూర్తయి ఆ మార్గం గుండా ప్రవహించిన నీరు లక్ష్మీపూర్ పంప్ హౌజుకు (ప్యాకేజీ 8) చేరుకున్నవి.

అట్లా పూర్తయిన ప్యాకేజీ 7 నుంచి ప్యాకేజీ 8 కి చేరుకున్న ప్రాణహిత జలాలు అక్కడ నుంచి బాహుబలి పంపుల ద్వారా ఎస్సారెస్పీ వరద కాల్వకు మరో రొండు మూడు చేరుకోనున్నయి. తద్వారా లింక్ 2 పనులు విజయవంతంగా పూర్తయితది. వరద కాల్వకు చేరుకున్న జలాలు అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా మిడ్ మానేరుకు, పంపింగ్ ద్వారా పైకి ఎస్సారెస్పీకి పోతయి. అట్లా తరలించిన కాళేశ్వర జలాలను తెలంగాణ బీల్లకు మల్లించి పూర్తి స్థాయి వినియోగంలోకి తెస్తరు. పిఎస్‌ఎల్వీని సమర్ధవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఈ ప్రక్రియ అంతా మరో వారం రోజుల్లో విజయవంతంగా పూర్తికానున్నది. విమర్శకులు అప్పటి దాకా గ్యాస్‌ను ఆగబట్టుకుంటే మంచిది.

Telangana Govt goal is to provide water to two crops

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంటోనికి తెలుస్తది గూనొంపు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.