రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్, రేప్ నిందితుడు దుర్మరణం

  భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్, నిందితుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్‌కు చెందిన రమేష్ నాయక్ రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో రమేష్ పట్టుకునేందుకు ఎస్‌ఐ రవీందర్ నాయక్ ఆధర్యంలో పోలీసులు బిహార్‌కు వెళ్లారు. నిందితుడు రమేష్ పట్టుకొని బిహార్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మధ్య ప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్ […] The post రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్, రేప్ నిందితుడు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్, నిందితుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్‌కు చెందిన రమేష్ నాయక్ రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో రమేష్ పట్టుకునేందుకు ఎస్‌ఐ రవీందర్ నాయక్ ఆధర్యంలో పోలీసులు బిహార్‌కు వెళ్లారు. నిందితుడు రమేష్ పట్టుకొని బిహార్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మధ్య ప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్ పూర్ వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న కారు చక్రాలు ఊడిపోయాయి. దీంతో వాహనం బోల్తాపడింది. కానిస్టేబుల్ తులసిరామ్, నిందితుడు రమేష్ ఘటనా స్థలంలో మృతి చెందగా ఎస్‌ఐ మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలానికి చెందిన తులసిరామ్‌కు 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. కానిస్టేబుల్ మృతిపట్ల ఎస్‌పి సజ్జనార్ సంతాపం తెలిపారు. తులసీరామ్ కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని సజ్జనార్ హామీ ఇచ్చారు.

 

Telangana Constable Died in Madhya Pradesh Accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్, రేప్ నిందితుడు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.