ఐ లవ్ మై టెడ్డీ…

Teddy-Bear

పిల్లల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బహుమతులలో టెడ్డి బేర్ ఒకటి. అయితే ఇప్పుడిది చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా సరదానే. అందులో మన సినిమా తారలు కొందరు సమయం దొరికితే వీటితో ఆడుకునేందుకు ఆసక్తి చూపిస్తారట! మరి దీని చరిత్ర ఏంటో తెలుసుకుందామా.. ఒక ఎలుగుబంటి రూపంలో మృదువైన బొమ్మగా జర్మనీలో 20వ శతాబ్ది ప్రారంభ సంవత్సరాల్లో తయారు చేయబడింది. మోరిస్ మిట్టోమ్ డ్రాయింగు చూసి రూజ్వెల్ట్ టెడ్డీ బేరును తయారు చేశాడు. అప్పడున్న అధ్యక్షులను థియోడర్ ‘టెడ్డీ’ గా పిలుచేవారట. అలా టెడ్డి బేర్ ఒక ప్రముఖ పిల్లల బొమ్మగా పేరు గాంచింది.

మొదటగా అతను ఒక చిన్న మృదువైన ఎలుగుబంటి పిల్ల బొమ్మను సృష్టించాడు. దాన్ని రూజ్వెల్టుకు పంపించి, అతని పేరును ఉపయోగించడానికి అనుమతిని పొంది తరువాత, ‘టెడ్డీ ఎలుగుబంటి’ అనే సంకేతంతో వ్యాపారం మొదలు పెట్టాడు. అలా నిజమైన ఎలుగుబంటి పిల్లల రూపాన్ని అనుకరించే టెడ్డి ఎలుగుబంట్లను సృష్టించినప్పటి నుండి, ఆ బొమ్మలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. తర్వాత రూపంలో, శైలిలో, రంగులో, చాలా మార్పులు వచ్చాయి. ప్రారంభ టెడ్డి ఎలుగుబంట్లు నిజమైన ఎలుగుబంట్లలాగే , పొడవాటి స్నాట్లు, పూసల కళ్ళు లాంటివి తయారు చేయబడ్డాయి.

ఆధునిక టెడ్డి ఎలుగుబంట్లు పెద్ద కళ్ళు నుదుటిపైన చిన్న ముక్కులు కలిగి ఉంటున్నాయి. టెడ్డీ ఎలుగుబంట్లు వివిధ రకాల ఎలుగుబంట్ల రూపంలో ఉంటాయి. వీటిని ధ్రువ ఎలుగుబంట్లు, బూడిద రంగు ఎలుగుబంట్లు, పాండాలు వంటి వాటిలాగే తయారు చేస్తారు. మొట్టమొదటి టెడ్డి ఎలుగుబంట్లు టావనీ మోహైర్ హెయిర్‌లో కనిపించాయి. ఆధునిక టెడ్డి ఎలుగుబంట్లు అనేక రకాల రంగుల్లో తయారు చేయబడుతున్నాయి. వీటిలో సాధారణంగా సింథటిక్ హెయిర్, వెల్లర్, డెనిమ్, పత్తి, శాటిన్, కాన్వాస్ వంటి హెయిర్‌ని వాడుతుంటారు.

Comments

comments