టెక్నో నుంచి నూతన స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్

Tecno Spark Go

 

హైదరాబాద్: టెక్నో మెబైల్ ఎలక్టానిక్ సంస్థ స్పార్క్ గో పేరుతో ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 5499ల ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 8 మెగాపిక్స‌ల్, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 2 జిబి ర్యామ్‌, 16 జిబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ని కలిగి ఉంది.

టెక్నో స్పార్క్ గో ఫీచర్లు… 

6.1 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్‌, 16 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయ‌ల్ సిమ్‌, 8 మెగాపిక్స‌ల్, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా, ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జి వివొఎల్టిఈ, 3000 ఎంఎహెచ్ బ్యాట‌రీ, వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.799 విలువ చేసే బ్లూటూత్ ఇయర్‌పీస్‌ను ఉచితంగా ఇస్తున్నారు.

Tecno Spark Go Phone Released in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టెక్నో నుంచి నూతన స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.