భారత్‌కు ఛాన్స్ ఉందికపిల్‌దేవ్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరచడం ఖాయమని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ జోస్యం చెప్పారు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో భారత్ ఎంతో బలోపేతంగా మారిందన్నారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌దేవ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ కచ్చితంగా సెమీఫైనల్‌కు చేరుకుంటుందనే ధీమాను కపిల్ వ్యక్తం చేశారు. మహేంద్ర సింగ్ […] The post భారత్‌కు ఛాన్స్ ఉందికపిల్‌దేవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరచడం ఖాయమని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ జోస్యం చెప్పారు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో భారత్ ఎంతో బలోపేతంగా మారిందన్నారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌దేవ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ కచ్చితంగా సెమీఫైనల్‌కు చేరుకుంటుందనే ధీమాను కపిల్ వ్యక్తం చేశారు. మహేంద్ర సింగ్ ధోని సేవలు అందుబాటులో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమన్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు సెమీస్‌కు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. అన్ని సజావుగా సాగితే కోహ్లి సేన విశ్వవిజేతగా నిలిచినా ఆశ్చర్యం లేదన్నారు. ఇక, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు తహతహలాడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ జట్లను కూడా తక్కువ అంచన వేయలేమన్నారు. తాను చూసిన అత్యుత్తమ భారత జట్లలో ప్రస్తుత జట్టే మెరుగైందన్నారు. మహ్మద్ షమి, బుమ్రా, భువనేశ్వర్‌లతో బౌలింగ్ చాలా బలంగా ఉందన్నారు. హార్దిక్ పాండ్య వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ జట్టుకు అందుబాటులో ఉండడం భారత్‌కు కలిసివస్తుందన్నారు. కాగా, ప్రపంచకప్‌లో ఫలానా జట్టే కప్పు సాధిస్తుందని ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదన్నారు. సెమీస్‌కు చేరిన జట్లను బట్టి ట్రోఫీ ఎవరూ గెలుస్తారనే దానిపై ఓ అవగాహకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు కప్పు సాధించే జట్టు ఇదేనని చెప్పడం మంచిది కాదని కపిల్ పేర్కొన్నారు.

Team India has chance win world cup:Kapil Dev

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్‌కు ఛాన్స్ ఉందికపిల్‌దేవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: